సాక్షి పత్రిక సర్క్యూలేషన్ ప్రకటించకుండా ఆపేయాలని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రజాధనంతో లక్షల కాపీలు వాలంటీర్లతో కొనిపించారని.. ఇది ప్రజాధనంను దోచుకోవడంతో పాటు సర్క్యూలేషన్ ను ఎక్కువగా చూపించుకునే కుట్ర అని… పిటిషనర్ ఈనాడు సంస్థ తరపున న్యాయవాదులు వాదించారు. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి పత్రిక సర్క్యూలేషన్ ఏపీలో రెండు, మూడు లక్షల లోపే ఉంది. కానీ … సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాలంటీర్లు, టీచర్లు ఇలా ప్రతి ఒక్కరికి అంటగట్టడం వల్ల మరో నాలుగైదు లక్షల కాపీలు ఎక్కువ రోజుకు ప్రజాధనంతో పెంచుకుంటున్నారు. కనీసం ఓ లక్ష కాపీలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇవన్నీ లెక్క తేలే సమయం దగ్గర పడటంతో సాక్షి సర్క్యూలేషన్ ను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
తప్పుడు సర్క్యూలేషన్ చూపించి.. ప్రజా ధనంతో పెద్ద ఎత్తున ప్రకటనలు మంజూరు చేసుకుంటున్నారు. ప్రకటనల బడ్జెట్లో సగానికిపైగా సాక్షి పత్రిక ఖాతాలోనే పడుతోంది. ఆ పత్రికకు సర్క్యూలేషన్ లేకపోయినా.. ఇలా దోపిడీ చేయడంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సర్క్యూలేషన్ పై స్టే విధించినందున ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయాల్సి ఉంటుంది. రెండు నెలల్లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాధనం ఎంత తన సొంత ఖాతాలో వేసుకున్నారో బయట పెట్టి కేసులు పెట్టే అవకాశం ఉంది.