సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం ?

తెలంగాణ నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెల్చుకునే లక్ష్యంతో కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కిషన్ రెడ్డిపై దానం నాగేందర్ ను బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది. దానం కూడా రెడీ అన్నట్లుగా చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కాంగ్రెస్ సీనియర్లందర్నీ కలిశారు. రేపో.. ఎల్లుండో కాంగ్రెస్ కండువా కప్పుకుని సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీకి దిగే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చేరికలు జరగనున్నాయి. విశాఖపట్నంలో బహిరంగసభలో పాల్గొన్న తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ.రంజిత్ రెడ్డి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే,తొలకంటి ప్రకాష్ గౌడ్, మాజీ మంత్రి ఇ, పెద్దిరెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి , మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వీరంతా రెండు రోజుల్లో పార్టీలో చేరబోతున్నారు. మరికొంత మంది కీలక నేతలు కూడా చేరే అవకాశం ఉంది.

బీజేపీ నేత జితేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ఢిల్లీలో ఆయనకు ఓ పదవి ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సోమవారం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. మూడో జాబితాలో తెలంగాణ నుండి తొమ్మిది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వీరిలో అత్యధికం కొత్తగా పార్టీలో కొత్తగా చేరిన వారికే అవకాశం లభించనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close