వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే ఆ బీసీ నేత ఎవరు అంటే..టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి అని వైసీపీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి.
పెందుర్తి సీటు జనసేనకు పోవడంతో టీడీపీ నేత బండారు సత్యనారాణమూర్తి. ఆయన కుమారుడు అప్పల్నాయుడు రగిలిపోతున్నారు. రోజూ బలప్రదర్శన చేస్తున్నారు. పార్టీ మారిపోతున్నామని లీకులు ఇస్తున్నారు. రెండు రోజుల్లో చెబుతామని అంటున్నారు. టీడీపీకి విధేయంగా పని చేసిన ఆయనకు.. లేదా ఆయన కుమారుడు.. పెందుర్తి టిక్కెట్ వచ్చేదే. కానీ పొత్తుల్లో గల్లంతు అయింది. తన స్థానాన్ని కాపాడాల్సిందని ఆయన అభిప్రాయం.
అయితే వైసీపీ నేతలపై గత ఐదేళ్లుగా పోరాడిన వారిని ఆయన ఒకరు. వాళ్ల భాషలోనే విమర్శించేవారు. ఈ క్రమంలో రోజాపై ఆయన చేసిన విమర్శల వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆయనకే వైసీపీ టిక్కెట్ ఆఫర్ చేయడం వైసీపీ వర్గాలను కూడా కాస్తంత విస్మయ పరుస్తోంది. బండారు టీడీపీకి అత్యంత విధేయుడని ఆయనకు చాన్స్ ఇచ్చినా వైసీపీలో ఉండరని అంటున్నారు. పైగా రామ్మోహన్ నాయుడు .. బండారుకు అల్లుడు. మరి వైసీపీ ఏం నిర్ణయం తీసుకుంటుందో ?