ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయిన కొద్ది సేపటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య యుద్ధం మొదలయింది. రాష్ట్రంలో విద్యుత్ పొదుపు కోసం సాధారణ బల్బులు, ట్యూబ్ లైట్ల స్థానంలో ఎల్.ఈ.డి. బల్బులు వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వీధి దీపాలకు ఇప్పుడు ఎల్.ఈ.డి. బల్బులనే వినియోగిస్తున్నారు. అదే విధంగా ఒక్కో కరెంటు బిల్లుకి రెండేసి ఎల్.ఈ.డి. బల్బులు చొప్పున రూ.20లకే రెండు బల్బులు ప్రజలకు అందించింది. కనుక లక్షలాది ఎల్.ఈ.డి. బల్బుల సరఫరా కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచిందా? అని శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి మంత్రి అచ్చెం నాయుడు సమాధానం చెపుతూ, కేంద్ర ప్రభుత్వ సంస్థకే ఆ కాంట్రాక్టుని అప్పగించినందున టెండర్లు పిలువలేదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలను ముందుంచుకొని వాటి పేరుతో తెదేపా ప్రభుత్వం బారీ కుంభకోణానికి పాల్పడిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అచ్చెం నాయుడు కూడా జగన్ కి చాలా దీటుగా సమాధానం ఇచ్చేరు. అవినీతికి మారుపేరుగా చెప్పుకోబడుతున్న జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ వంటివారు మాట్లాడుతుంటే తనకు చాలా ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు.
వారిరువురి వాగ్వాదం చూస్తుంటే ఒక సమస్య మూలాలలోకి వెళ్లి దాని పరిష్కారం కోసం వెతికే ప్రయత్నం చేయకుండా ఆ సమస్యను పట్టుకొని ఇద్దరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడానికే ఇష్టపడుతునట్లుంది. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఏవిధంగా రెచ్చగొడితే అతనిని సమస్యలపై చర్చించకుండా పక్కదారి పట్టించవచ్చో తెదేపా నేతలు బాగానే కనిపెట్టాఋ. కానీ వారి ఈ వ్యూహాన్ని అర్ధం చేసుకోలేక వారు విసిరిన ఈ ఉచ్చులో చిక్కుకుపోయి తెదేపా మంత్రులపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి సభలో విరుచుకుపడుతూ వారిపై తనే పైచెయ్యి సాధించాననే భ్రమలో మురిసిపోతుంటారు.