ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ కావడానికి ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేశారో లెక్క లేదు. ఇప్పుడు వాళ్ల అధికారం పోయింది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ నేతల మీదకే ఎక్కు పెట్టారు. ఎవరినో బ్లాక్ మెయిల్ చేయడానికన్నట్లగా బ్రేకింగ్‌లు వేసి పసలేని స్టోరీలు అల్లేస్తున్నారు.
ఎన్టీవీకి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ లాంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన మాట్లాడుతున్నా.. అదీ జగన్ ప్రచార సభల గురించిచెబుతున్నా.. లైవ్ ఇవ్వకుండా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఏం చెప్పారో అంటూ ఊహాగానాలను ప్రసారంచేశారు. ఓ మీడియా సంస్థ అధినేత దగ్గరే సర్వర్ పెట్టారని.. మొత్తం ఆయన చెప్పినట్లుగా చేశారని.. దీని వెనుక ఓ బీఆర్ెస్ కీలక నేత ఉన్నారని కనీసం గంటన్నర సేపు షో చేశారు.
కానీ ఇది అంతగా పేలలేదు. గతంలో రేవంత్ రెడ్డిని ఐటీ అధికారుల పేరుతో ఇంట్లో బంధిస్తే.. బయట ఎన్టీవీలో తప్పుడు డాక్యుమెంట్లు చూపించి మరీ చేసిన ఫేక్ ప్రచారంలో సగం కూడా లేదు. ఎవరూ నమ్మేలా లేదు. కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్స్ చూపించినా.. ఎన్టీవీ గురించి తెలిసిన వారు.. ఇదేదో జోకుడు ప్రోగ్రాంలా ఉందని అనుకుంటున్నారు. ఎన్టీవీ ఎంతగా ప్లేట్ ఫిరాయించింది అంటే.. పార్టీ పిరాయింపులు కేసీఆర్ చేసుకున్న పాపమేనని స్టోరీలు రాస్తున్నారు. గతంలో కేసీఆర్ చాణక్యం.. తిరుగులేని బాపు అంటూ .. దాన్నే పొగిడారు. ఇప్పుడు రివర్స్ అయ్యారు.
మొత్తంగా ఎన్టీవీ ఓనర్ పదేళ్ల పాటు కాంగ్రెస్ మీద.. రేవంత్ మీద చేసిన దాష్టీకాలకు తనను ఎక్కడ టార్గెట్ చేస్తారోనని భయపడి.. అడ్డంగా టర్న్ తీసుకుని ఇప్పుడు కల్ట్ చూపిస్తున్నారు. మరి రేవంత్ .. క్షమించేస్తారా ?