ఎన్నికల షెడ్యూల్‌కు.. పోలింగ్ కు మధ్య దాదాపుగా రెండు నెలల సమయం ఉంటే… ఎలా ప్రచారం చేయాలా అని మథనపడిన వైసీపీ వ్యూహకర్తలు… కొన్నాళ్లు బస్సు యాత్ర ద్వారా టైంపాస్ చేయాలన్న ఆలోచన చేశారు. ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకూ బస్సు యాత్ర చేస్తే చాలా వరకూ నియోజకవర్గాలు కవర్ అవుతాయని అనుకున్నారు. అనుకున్నట్లుగా ప్రకటించారు. అయితే రోడ్ల సమస్యలు ఎక్కడికక్కడ వెలుగులోకి వస్తాయి కాబట్టి వినూత్నంగా ఆలోచించారు.
కేవలం జాతీయ రహదారులపైనే యాత్ర జరిగేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడైనా రాష్ట్ర రహదారుల్లోకి వెళ్లాలంటే.. అక్కడ ప్యాచ్ వర్కులు చేయించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దాదాపుగా ఇరవై కోట్లతో ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సును అణాకాణికి అద్దెకు తీసుకుని తిరిగేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఆ బస్సు పొరపాటున ఎక్కడైనా ఇరుక్కుపోయినా.. డ్యామేజ్ అయినా పరువు పోతుంది.
బ స్సు యాత్ర అనే ఆలోచన చేయడం కాస్త రిస్కేనని.. అయిన తప్పడం లేదని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. రెండు నెలల పాటు ప్రచారసభల్లో పాల్గొనే ఓపిక జగన్ కు లేదని.. ఐదేళ్ల పాటు ఇంట్లో ఉండి.. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అయినా పార్టీ క్యాడర్ ను కలవకపోతే ఇబ్బందన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని అంటున్నారు. మొత్తానికి బస్సు యాత్ర మాత్రం.. ఓ ప్రహసనంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.