ఏపీ ప్రభుత్వం కులగణన పేరుతో చేసిన హడావుడి వెనుక పెద్ద స్కాం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కులగణన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సర్వే వివరాలు FAO సంస్థకు చేరిపోయాయి. ఆ సంస్థతో కాంట్రాక్ట్ ఆపేశామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ సమాచారం అనధికారికంగా చేరింది. అధికారింగా మాత్రం కులగణనను పక్కన పెట్టామని అంటున్నారు. ఈ సర్వే వివరాలను పుస్తక రూపంలో తీసుకువస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన లేదంటున్నారు.
ఇప్పటికి వరకు కులగణన వివరాలు ప్రణాళిక శాఖ వద్దకు కూడా చేరలేదని చెబుతున్నారు. కార్యక్రమానికి నేతృత్వం వహించింది ప్రణాళిక శాఖే అయినప్పటికీ, సర్వే చేసింది మాత్రం వార్డు, గ్రామ సచివాలయాల కార్యదర్శులు. వారికి వాలంటీర్లు సహకరించారు. గత నెల 20వ తేదికే వివరాల సేకరణ పూర్తయినప్పటికీ, అవి సచివాలయాల శాఖ వద్దే నిలిచిపోయాయి. వీరందరి డేటా ప్రాసెస్ చేసేది రామ్ ఇన్ఫో, FAOనే.
కులాల వివరాలే కాకుండా వారి ఆర్థిక పరిస్థితి, ఆస్తులు, ఇళ్లలో ఉన్న పశువుల వివరాలు, గొర్రెలు, వంట కోసం వినియోగిస్తున్న గ్యాస్, విద్యుత్ స్టౌ, వంట చెరకు, గోబర్ గ్యాస్, బయో ఇరధనం వంటి విధానాలను కూడా తెలుసుకున్నారు. ఆదాయ వనరులు, వారికి ఉన్న వ్యవసాయ భూమి, ఇళ్లు వంటి వాటిపైనా వివరాలతోపాటు, 50 సెంట్లు కన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉన్న వారు, అంతకు మిరచి భూమి ఉన్న వారి వివరాలను కూడా సేకరించారు. అసలు లక్ష్యం కులగణన పేరుతో ప్రభుత్వం చేసుకున్న ప్రచారం కాదని.. కేవలం రాజకీయంగా సమాచారాన్ని వాడుకునేందుకు ప్రజల డేటా చోరీ చేశారన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.