రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్షా అనాలన్న లక్ష్యంతో ఉన్న సినీ నటుడు అలీకి మరోసారి కుచ్చుటోపినే పెట్టారు వైసీపీ అధినేత. పవన్ తో పాటు ఉండి ఉంటే.. మైనార్టీ కోటాలో ఆయన కోసం ఎక్కడో ఓ చోట ఖచ్చితంగా ఓ సీటును రిజర్వ్ చేసేవారు పవన్. కానీ ఇప్పుడు ఏటూ కాకుండా పోయింది. ఆయనకు సీటు లేదు.. కానీ ఆశలు పెట్టి.. ఎగతాళి చేస్తున్నట్లు అయింది.
ఎక్కడో చోట సీటు ఇస్తే చాలనుకున్నారు అలీ. ఆయన కోసం నంద్యాల ఎంపీ.. కర్నూలు ఎంపీ.. రాజమండ్రి ఎంపీ.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అంటూ.. పుకార్లు లేపారు. అంతా ఉత్తదే. అసలు ఏ దేశలోనూ అలీ పేరు పరిశీలనలోకి తీసుకోలేదు. కానీ ఈ పుకార్లను నమ్మిన అలీ తనకు క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వస్తుందని ఎదురు చూస్తూ కూర్చున్నారు. కానీ పిలుపు రాలేదు.. లిస్ట్ వచ్చింది. లిస్ట్ లో ఆయన పేరే లేదు.
అలీ 2014లో ఎన్నికల్లో పోటీకి ప్రయత్నించారు. అప్పట్లో అన్ని పార్టీలు తిరిగారు. సర్వేలు చేయించిన తర్వాత టీడీపీ అనుకూలత రాలేదని.. పార్టీలో చేరితే తర్వాత ఎన్నికల నాటికి చూస్తామని చెప్పింది. పవన్ ఒంటరిగా పోటీ చేస్తూండటంతో గెలవలేమని చెప్పి.. చివరికి వైసీపీలో చేరారు. వైసీపీలో టిక్కెట్ రాకపోగా.. పవన్ ని బూతులు తిట్టించారు. ఫలితంగా స్నేహితుడు అయిన పవన్ మళ్లీ పలకరింపులు లేనంతగా దూరమయ్యారు.
పోనీ తన లక్ష్యం ప్రజాప్రతినిధి అవ్వాలన్న కోరిక తీరుతుందా అంటే.. అదీ కూడా లేదు. ప్రాణ స్నేహితుడ్ని కాకుండా జగన్ ను నమ్మి నట్టేట మునిగిన అలీ.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే సెటైర్లు పడుతున్నాయి.