దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు అత్యంత సన్నిహితులు, ఆయనకు ఈ సారి టిక్కెట్ రాలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. చంద్రబాబు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారా అని సొంత పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. మైలవరం నుంచి వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు ఇచ్చేశారు. దేవినేని ఉమకు మరో సీటు కేటాయించలేదు.
నిజానికి దేవినేని ఉమ సీటు మారుస్తారని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. కారణం ఏదైనప్పటికీ.. దేవినేని ఉమకు చంద్రబాబు వద్ద తప్ప.. మిగతా కృష్ణా జిల్లా నేతల్లో అంత సానుకూలత లేదు. ఆయన వల్లే కృష్ణా జిల్లాలో పార్టీకి తీవ్ర సమస్యలని చెబుతూ ఉంటారు. కొడాలి నాని వెళ్లిపోవడానిి ఉమనే కారణమంటారు. ఇలా చాలా ఉన్నాయి. అయితే చంద్రబాబు ఎంత మంది పార్టీ నుంచి వెళ్లిపోయినా దేవినేని ఉమకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ సారి మాత్రం సీటు కేటాయించలేదు
వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దేవినేని ఉమ.. నాలుగు సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు.. కానీ, గత ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. మైలవరం కాకపోతే పెనుమలూరు అయినా కేటాయిస్తారనుకున్నారు. కానీ అక్కడ బోడె ప్రసాద్ మైండ్ గేమ్ ఆడారు. చివరికి ఆయనకే టిక్కెట్ ఖరారు అయింది. దేవినేని ఉమ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.