రఘురామకృష్ణ రాజు తన రాజకీయ జీవితంలో బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. పైగా మోదీని ఆయన పొగుడుతూనే ఉంటారు. బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ ఆయనకు రెండో సారి బీజేపీ హ్యాండిచ్చింది. 2014 ఎన్నికల సమయంలోనూ ఆయన నర్సాపురం నుంచి పోటీకి బీజేపీ తరపున ఏర్పాట్లు చేసుకుంటే… పొత్తులో భాగంగా సీటు వచ్చినా… గోకరాజు గంగరాజుకు సీటిచ్చారు. తర్వాత ఆయన తప్ప ఆయన కుటుంబీకులంతా వైసీపీలో చేరిపోయారు.
ఇప్పుడు మరోసారి అలాగే.. రఘురామకు హ్యాండిచ్చారు. నర్సాపురంలో రఘురామ కన్నా పొటెన్షియల్ క్యాండిడేట్ ఎవరు ఉంటారు ?.. కానీ ఉద్దేశపూర్వకంగా ఆయనకు టిక్కెట్ దక్కనివ్వకూడదన్న లక్ష్యంతో అందరూ కలిసి ఆయనను దూరం పెట్టారు. ఆయనపై ఎందుకు అంత వ్యతిరేకత ?. జగన్ అరాచకాలపై ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. దానికే వ్యతిరేకత పెంచుకుంటారా ?. జగన్ పై పోరాడితే బీజేపీ నేతలకు ఎందుకు నొప్పి ? అనేది చాలా మందికి అర్థం కాని విషయం.
వైసీపీ వద్దనుకున్న వరప్రసాద్ కు పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు. ఉదయం పార్టీలో చేర్చుకుని మధ్యాహ్నానికి టిక్కెట్ ఇచ్చారు. మరి జగన్ పై పోరాడుతున్న రఘురామకు ఎందుకివ్వలేదు. ?. ఆ సీటు కూటమిలో భాగంగా టీడీపీకే వదిలి పెడితే… వారే ఇచ్చుకునేవారు కదా !. తాము గతంలో గెలిచిన సీటు అని పట్టుబట్టి ఎందుకు తీసుకున్నారు ? . ఇదంతా జగన్ పై పోరాడినదానికి ఆయన పడుతున్న కష్టమే. కానీ రఘురామ మాత్రం జగన్ ను వదిలి పెట్టే ప్రశ్నే ఉండదని అంటున్నారు.
https://x.com/telugu360/status/1771926830640992262?s=46