మైనింగ్ డాన్ , బెయిల్ కోసం న్యాయమూర్తులకు లంచాలు ఇచ్చి దొరికిపోయిన కేసుల్లో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి మరోసారి బీజేపీలో విలీనం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే పార్టీ పెట్టి.. తాను ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్ని చోట్ల బీజేపీ ఓట్లు చీల్చి ఆ పార్టీని ఓడించారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని అన్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత సిద్దరామయ్యను సీఎంను చేస్తే.. తాను కాంగ్రెస్ కే మద్దతు ఇస్తానని ప్రకటించారు. కానీ ఆయన మద్దతు కాంగ్రెస్ తీసుకోలేదు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నుంచి విడిపోయి పార్టీ పెట్టుకోవడం.. మళ్లీ కలసిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఓ సారి ఇదే పని చేశారు. గనుల్లో ఆదాయం బాగున్నప్పుడు కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పారు. బళ్లారి నుంచి హెలికాఫ్టర్లో బెంగళూరు వెళ్లి .. మళ్లీ లంచ్ కోసం బళ్లారి వచ్చేంత బ డాయి పోయేవారు. సీబీఐ కేసులయ్యాక.. బీజేపీ తనను పట్టించుకోవడం లేదని.. శ్రీరాములతో కలిసి ఓ కొత్త పార్టీ పెట్టారు. తర్వాత మళ్లీ బీజేపీలో విలీనం చేశారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి తప్ప ఆయన వర్గం అంతా ఓడిపోయారు. బీజేపీ నుంచే పోటీ చేసిన శ్రీరాములు వంటి వారు కూడా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ శ్రీరాములు బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ఆయనను గెలిపించుకునేందుకు గాలి జనార్ధన్ రెడ్డి పోటీ చేయనున్నా రు.