దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకొనే కథానాయకుల్లో ప్రభాస్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. తన చేతిలోనూ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. తన ఆదాయాన్ని స్థిరాస్థులపై పెట్టుబడి పెట్టడానికి ప్రభాస్ నిర్ణయించుకొన్నాడు. హైదరాబాద్ శివార్లలో రూ.100 కోట్లతో ఓ ఖరీదైన ఫామ్ హోస్ కట్టుకొంటున్నాడు ప్రభాస్. ఇందులో అత్యాధునిక వసతులన్నీ ఉండబోతున్నాయి. ఇప్పుడు యూరప్‌లోనూ ఓ ఇల్లు కొన్నాడని సమాచారం. ప్రభాస్ కు ఫారెన్ ట్రిప్పులు ఎక్కువ. తరచూ యూరప్ వెళ్తుంటాడు. అక్కడ తనకు స్నేహితులు కూడా ఉన్నారు. యూరప్‌లో ఓ పెద్ద బంగ్లా ప్రభాస్ అద్దెకు తీసుకొన్నాడు. ఎప్పుడు వెళ్లినా అక్కడే మకాం. ఆ బంగ్లాకి యేడాదికి కనీసం కోటి రూపాయలు అద్దె చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే… ఇప్పుడు ఏకంగా ఆ బంగ్లానే కొనడానికి ప్రభాస్ సిద్ధమయ్యాడని సమాచారం. ప్రభాస్ పారితోషికం దాదాపు రూ.100 నుంచి 130 కోట్ల వరకూ ఉంటోంది. యూవీ క్రియేషన్స్‌లో తాను వాటాదారు కూడా. కొన్ని సినిమాల లాభాల్లో ప్రభాస్‌కు వాటాలు అందుతుంటాయి. సో.. ఎటు చూసినా ప్రభాస్ శ్రీమంతుడే. కాబట్టి తను వంద కోట్లతో ఫామ్ హౌస్ కట్టడం, కోట్ల రూపాయల బంగ్లా విదేశాల్లో కొనుగోలు చేయడం పెద్ద విశేషం ఏం కాదు. మన కథానాయకుల్లో చాలామందికి విదేశాల్లో విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ప్రభాస్ చేరాడు.