బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలతో పాటు… మ హబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ నెల 28న జరగబోయే మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడానికి బీఆర్ఎస్ గోవాలో క్యాంపులు ఏర్పాటు చేసింది. అక్కడున్న జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో 70 శాతం మంది బీఆర్ఎస్కు చెందిన వారే. అయినా అధికారం పోవడంతో ఓట్లు వేస్తారో లేదో తెలియని పరిస్థితి. సింది. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలందర్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోవాకు తీసుకెళి, గత రెండు రోజుల నుంచి అక్కడే క్యాంపు రాజకీయాలు నడిపారు.
అధికారంలో ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కాపాడుకోలేకపోయారు బీఆర్ఎస్ నేతలు. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. అప్పట్లో నల్లగొండ జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలందరూ బీఆర్ఎస్ వారే ఉన్నప్పటికీ… కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. అంటే కారు పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువ మంది హస్తానికి ఓటేశారన్నమాట. అలాంటి పరిస్థితే ఇప్పుడూ ఎదురవుతుందని బీఆర్ఎస్ ఆందోళన చెదుతోంది.
మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 1,394 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఉండగా, వీరిలో బీఆర్ఎస్కు 823, కాంగ్రెస్కు 396, బీజేపీకి 88, బీఎస్పీకి ఒకటి, సీపీఐకి 4, సీపీఐ(ఎం)కు ఇద్దరు, ఎంఐఎంకు ఆరుగురు ఓటర్లు ఉన్నారు. ఇండిపెండెంట్లు 13 మంది ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కు విజయం నల్లేరుపై నడకే. కానీ రేవంత్ రెడ్డి… వ్యూహాత్మకంగా నిన్నామొన్నటి వరకూ బీఆర్ఎస్ లో ఉన్న ఆర్థికంగా బలవంతుడు అయిన మన్నె జీవన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపారు. ఆయన మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి సమీప బంధువు.