అక్కా .. తీహార్ జైలుకు స్వాగతం అంటూ సుఖేష్ చంద్రశేఖర్ కవితకు రాసిన లేఖలు నిజమయ్యాయి. అక్కడ నిజంగానే తీహార్ జైలుకు వెళ్లారు. ఈడీ అధికారులు అరెస్టు చేసిన పది రోజుల వరకూ కస్టడీలో ఉండటంతో జైలుకు తరలించలేదు. ఈడీ ఆఫీసులోనే ప్రశ్నించారు. కస్టడీ పూర్తయిన తర్వాత తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. విచారణ వాయిదా పడింది. ఆ తర్వాత జైలులో తనకు కావాల్సిన సౌకర్యాల లిస్టును జత చేసి మరో పిటిషన్ వేశారు.ఈ జాబితాలో ఆభరణాలు కూడా ఉండటం వైరల్ గా మారింది.
సాదారణంగా జైలుకు పంపితే.. పొలిటికల్ వీఐపీలు తమకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు. ఈ హోదా సౌకర్యాల రూపంలో లబిస్తుంది. ఇంటి నుంచి భోజనం, మంచి పరుపు, న్యూస్ పేపర్లు, బుక్స్.. కొన్ని సందర్భాల్లో టీవీ కూడా ఏర్పాటు చేస్తారు. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్య రీత్యా ఏసీ కూడా ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక్కడ కవిత కూడా జైలులో ఏసీ కాదు కానీ.. అలాంటి కొన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇంటి నుంచి ఆహారంతో పాటు మంచి పరువు, బెడ్ షీట్స్, స్లిప్పర్లు, బుక్స్, బ్లాంకెట్స్, పెన్ను, పేపర్లు, మెడిసిన్స్ తో పాటు.. కూడా ఈ జాబితాలో జ్యూయలరీ కూడా ఉంది.
ఆ జ్యూయలరీ ఏమిటన్న డీటైల్స్ లేవు. కానీ సహజంగా జైలుకు వెళ్లిన సమయంలో అసలు ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు ఉండనీయరు. కానీ మహిళలు సంప్రదాయబద్దంగా కొన్ని ఆభరణాలు ధరిస్తారు. వాటిని తీసేయడం అశుభంగా భావిస్తారు. తాళి, మెట్టెలు, ఉంగరాలు వంటివాటిని తీయరు. బహుశా .. కవిత ఈ ఆభరణాలను జైలులో డిపాజిట్ చేయకుండా తన ఒంటి మీదనే ఉంచుకునేలా కోర్టు పర్మిషన్ అడిగి ఉంటారని భావిస్తున్నారు. నెక్లెస్లు, హారాలు వేసుకుంటామని అడిగే సందర్భం ఉండదని అనుకోవచ్చు.