ఇంటింటి ప్రచారం చేసుకోవాలన్నా సరే అనుమతి తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. అంటే ఎన్నికలకు సంబంధి ఒక్క అడుగు.. ముందుకూ వెనక్కి వేయాలన్న ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. మొత్తం ఎన్నికల సంఘం కనుసన్నల్లో జరగాల్సిందే. నిజం చెప్పాలంటే ఈ అధికారం ఈసీకి ఉంది. వ్యవస్థ కుఉన్న పవర్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించేందుకు అవసరమైన పటిష్టమైన యంత్రాంగం ఉందా అంటే.. ప్చ్ అని సాధారణ వ్యక్తి కూడా నిరాశపడాల్సిందే.
ఎన్నికల కోడ్ వచ్చి పది రోజులు అవుతుంది. ఏపీలో జనం ఎలాంటి మార్పు చూడలేకపోతున్నారు. ఎక్కడ చూసినా అరాచక మూకలు విరుచుకుపడుతున్నాయి. రాజకీయ హత్యలు నాలుగు జరిగాయి. ప్రధాని సభలో భద్రతా వైఫల్యం బయటపడింది. సీ విజిల్ యాప్ లో ఫిర్యాదులు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్తున్నాయి. సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు చేయాలంటే… ఓ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా బయపడే పరిస్థితిని విజయవాడ గన్నవరంలో సృష్టించారు. కానీ ఎక్కడా వ్యవస్థ తన పవర్ చూపించలేదు. కానీ మా పర్మిషన్ తీసుకోవాల్సిందేనని.. చిన్న చిన్న విషయాల్లో తమ పవర్ చూపించేందుకు ఆరాటపడుతోంది.
వాలంటీర్లు, ప్రభుత్వం వద్ద జీతం తీసుకునేవారు.. అడ్డగోలుగా వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. మీడియాలో వస్తే కొంత మందిపై చర్యలు తీసుకుని ఇదీ మా ప్రతాపం అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ.. అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కడం లేదు. ఇంత జరుగుతున్నాఏమీ చేయలేకపోతున్న యంత్రాంగాన్ని నడుపుతున్న చీఫ్ సెక్రటరీని.. డీజీపీని తప్పించి డైనమిక్ ఆఫీసర్స్ కు చాన్సిస్తే.. వ్యవస్థలు ఎంత బలంగా ఉంటాయో…ఆచరణలో చూపిస్తారు. కానీ ఇంత వరకూ చిన్న అధికారిపై చర్యలు తీసుకోలేకపోయారు.
రాష్ట్రం మొత్తం ఓ సామాజికవర్గం గుప్పిట్లో ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు.. సామ, భేద, దాన, దండోపాయాలతో అధికార పార్టీ రెడీ అయపోయింది. అన్నిప్లాన్లూ అమలు చేస్తున్నారు. కళ్ల ముందే కనిపిస్తోంది. కానీ ఈసీ మాత్రం సిల్లీ రూల్స్ చూపించి.. వాటిని అమలు చేయాలని కీచగొంతుతో అరుస్తోంది. ఈ సమయంలో కావాల్సింది గాండ్రింపులే… ఆ అధికారం కూడా ఉంది. ఎంత ఉపయోగించుకుంటే.. అంత పవర్ ఓఫుల్…లేకపోతే ప్రజలు ఇంతే మా ప్రాప్తం అనుకుంటారు.