మాజీ మంత్రి హరీష్ రావు పీఏ నరేష్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారని, మరో ముగ్గురితో కలిసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి చెక్కులు డ్రా చేసుకున్నారన్న వార్తలు సంచలనంగా మారాయి. ఇప్పటికే కేసు నమోదు కాగా, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
అయితే, ఈ కేసులో మంత్రి హరీష్ రావు ఆఫీసులో ఇంకెవరి ప్రమేయం అయినా ఉందా? హరీష్ రావును కూడా ఇరికిస్తారా…? అంటూ రకరకాలుగా చర్చ జరగుతున్న సమయంలో హరీష్ రావు ఆఫీస్ కీలక ప్రకటన చేసింది.
నరేష్ అనే వ్యక్తి హరీష్ రావు గారికి పీఏ కాదని… ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అని వివరణ ఇచ్చింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చినప్పుడే తాము కేసు నమోదు చేశామని, 17-12-2023నాడు తాము కూడా ఫిర్యాదు చేశామని…ఎన్నికల ఫలితాలు రాగానే 06-12-2023నుండే ఆఫీసు నుండి మూసివేసినట్లు తెలిపింది. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
అసలు కేసు ఏంటీ?
హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో ఉండే నరేష్ అనే వ్యక్తి సీఎంఆర్ఎఫ్ చెక్కులు చూసేవారు. కానీ ఆ చెక్కులు ఇచ్చే సమయంలో డబ్బులు వసూలు చేస్తారన్న ఆరోపణలు వచ్చాయి. వీడియోలు కూడా మీడియాలో వచ్చాయి. తాజాగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి లబ్ధిదారులకు రావాల్సిన మొత్తాన్ని తీసుకున్నట్లు తేలటంతో కేసు నమోదైంది.