అనుపమ పరమేశ్వరన్ అలిగింది. ఆ ఎఫెక్ట్ ‘టిల్లు స్వ్కేర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై పడింది. డీజే టిల్లు ప్రీ రిలీజ్ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కథానాయిక అనుపమ రాలేదు. దానికి కారణం అనుపమకు కోపం వచ్చింది. టీమ్ మీద కాదు. ఫ్యాన్స్ మీద.
విషయం ఏమిటంటే.. ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎప్పుడూ లేనంత హాట్ గా కనిపిస్తోంది అనుపమ. లిక్ లాక్కులతో రెచ్చిపోయింది. పోస్టర్ల కోసం కూడా హాట్ పోజులిచ్చింది. తాజాగా ఓ పోస్టర్ విడుదలైంది. అందులో.. సిద్దు జొన్నలగడ్డ ఒడిలో కూర్చున్న స్టిల్ మరింత హాట్ గా కనిపిస్తోంది. ఈ పోస్టర్ బాగా వైరల్ అయ్యింది. అనుపమ ఇలా రెచ్చిపోతోందేంటి? అని చాలామంది ఆశ్చర్యపోతే, ఇంకొంతమంది ట్రోల్ చేయడం మొదలెట్టారు. కామెంట్లు కూడా శ్రుతిమించాయి. దాంతో..అనుపమ అలిగిందని, ఆ కారణంతోనే ప్రీ రిలీజ్ కి డుమ్మా కొట్టిందని తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డ తన స్పీచ్ లోనూ అదే చెప్పాడు. ”ఫీమేల్ యాక్టర్స్ గురించి కామెంట్ చేసేటప్పుడు కాస్త హుందాగా వ్యవహరిస్తే మంచిది. ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే అది అందంగా, అందరూ ఎంజాయ్ చేసేలా ఉండాలి. ఇబ్బంది పెట్టకూడదు. సెన్సిటివ్ మ్యాటర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంత మంది అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మందికాదు” అని సిద్దు హితవు పలికాడు.