కంటెయినర్ గుట్టు వీడుతున్నట్లే కనిపిస్తోంది. జగన్ క్యాంప్ ఆఫీసులోకి వెళ్లిన కంటెయినర్ అట్ట పెట్టెల్ని నింపుకుని ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లింది. అక్కడ అట్టపెట్టెల్ని ఓ ఉన్నతాధికారి చాంబర్ కు తరలించారు. ఈ విషయంలో వివాదం నడుస్తూండగానే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఆర్టీసికి రూ. 20 కోట్ల నగదును వైసీపీ కట్టింది. అచ్చంగా క్యాష్. అంటే నోట్ల కట్టలు కట్టింది.
ఈ క్యాష్ అంతా.. ఆర్టీసీ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. రూ. 20 కోట్ల నగదు తీసుకెళ్లాలంటే.. కనీసం కంటెయినర్ ఉండాల్సిందే. ఇదంతా ఓ ఎత్తు అయితే అసలు ఆ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు సస్పెన్స్. అదీ కూడా క్యాంపాఫీస్ నుంచి ఎలా తరలించగలిగారన్నది మరో కీలక అంశం. క్యాంప్ ఆఫీస్ నుంచి తరలించలేదని బుకాయించే అవకాశం ఉంది.. కానీ కంటెయినర్ ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకుంది… సీసీ కెమెరా దృశ్యాలు విడుదల చేయాలన్న డిమాండ్ పై అంతా సైలెంట్ గా ఉన్నారు. గుంటూరు ఎస్పీ కూడా నో కామెంట్ అంటున్నారు.
ఎన్నికల సమయంలో రూ. 50వేలు తీసుకెళ్లినా పోలీసులు సీజ్ చేస్తారు. కానీ వైసీపీ ఏకంగా ఇరవై కోట్ల క్యాష్ ను తీసుకెళ్లి కట్టింది. అది కూడా పోలీస్ అని స్టిక్కర్ అంటించుకున్న వెహికల్ లో . ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఆ వెహికల్ క్యాంప్ ఆఫీస్ కు వచ్చినట్లుగా రికార్డుల్లో కూడా నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. అంటే రికార్డుల పరంగా అలాంటి కంటెయినర్ ఏదీ క్యాంప్ ఆఫీస్‌కు రాలేదన్న మాట.
ఇంతకీ ఆర్టీసీకి వైసీపీ డబ్బులు ఎందుకు కట్టిందంటే . సిద్ధం సభలకు ఆర్టీసీకి వైసీపీకి బకాయిపడింది. ప్రభుత్వం మారితే ఆ బకాయిల పేరుతో జరిగే రాజకీయం గురించి అంచనా ఉంది కాబట్టి డబ్బులు కట్టేసింది. సాధారణంగా ఏ పార్టీ అయినా ఆన్ లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తాయి. క్యాష్ కట్టవు. కానీ వైసీపీ లెక్క లేవు. ఓన్లీ క్యాష్. ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారే అవకాశం ఉంది.