ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో…జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇదెంత తప్పుడు వ్యూహమో.. వైసీప వ్యూహకర్తలకు మొదటి రోజే అనుభవంలోకి వచ్చింది.
జగన్ బస్సు యాత్రకు ఎక్కడా కవరేజీ రాలేదు. చివరికి జగన్ బయటకు అడుగేస్తే… లైవ్ అవ్వాలని అప్రకటిత ఒప్పందాలున్న నీలి, కూలి మీడియా చానళ్లు కూడా.. జగన్ బస్సు యాత్రను కవర్ చేయలేదు. సాక్షి మీడియా ఇచ్చిన కవరేజీ నవ్వుల పాలయింది. జనాల్లేని దృశ్యాలు వైరల్ అయ్యాయి. వెంపల్లెలోనే జగన్ పది నిమిషాల్లో వస్తున్నారని తెలిసినా పట్టుమని ఇరవై మంది కూడాలేరు. ఇక ఇడుపుల పాయ వైపు దృశ్యాలు చూపించడానికి చానళ్లు సిద్ధపడలేదు. నీలి, కూలి మీడియాకు కూడా సొంతకవరేజీకి చాన్స్ ఇవ్వడం లేదు.
ఇడుపులపాయ నుంచి బయలుదేరి ప్రొద్దుటూరుకు వచ్చే వరకూ… మూడు నియోజకవర్గాలు కవర్ చేసినా.. బస్సు నెమ్మదిగా వచ్చినా.. ఎక్కడైనా ఆయనకు జన ప్రవాహంతో ఉన్న దృశ్యాలను కవర్ చేయలేకపోయారు. అలాంటి పరిస్తితి కనిపించలేదు. ఎక్కడ చూసినా ఖాళీగానే కనిపిస్తోంది. కొన్ని ఐ ప్యాక్ స్కిట్లు వేసినా అవి నవ్వుల పాలయ్యాయి. ఎండాకాలంలో… బస్సు యాత్ర పెట్టడం.. క్యాడర్ ను వదిలేసి వాలంటీర్ల మీద రాజకీయం చేస్తున్న సమయంలో వారు ఉత్సాహంగా వస్తారని ఆశించడం కూడా తప్పేనని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.