సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. వ్యాపారసంస్థలు.. రాజకీయ పార్టీలకు కూడా. ఇలాంటి పయనం తెలుగుదేశం పార్టీ. దేశ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఓ అద్భుతం. ఆ పార్టీపై జరిగినన్ని కుట్రలు, కుతంత్రాలు మరే పార్టీపైనా జరిగి ఉండవు. ఆ పార్టీని పరిమితం చేయడానికి చివరికి ఓ రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చింది. అయినా టీడీపీ ఎప్పటికప్పుడు సవాళ్లను ఎదుర్కొంటూ ఫీనిక్స్ లా తనను తాను ప్రజల ముందు గొప్పగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సతవం నేడు.
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఓ ప్రాంతీయ పార్టీ ఇంత కాలం మనగలగడమే అద్భుతం . అందులో టీడీపీ పయనం మరింత ప్రత్యేకం. ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు ఎదుర్కొని ఎప్పటికప్పుడు తట్టుకుని … ఫీనిక్స్ పక్షిలా మళ్లీ అగ్రస్థానానికి ఎదుగుతుంది. 2019 ఎన్నికల తర్వాత చాలా మంది టీడీపీ నేతలే… ఇక పార్టీ ఉంటుందా అన్న ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేసిందన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఏకపక్ష ఫలితం.. సర్వేల ఫలితాలు.. ప్రజల్లో కనిపిస్తున్న మార్పు మరోసారి టీడీపీ చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం కలిగించేలా చేస్తోంది.
ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించిన నాటి నుండి ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. ఓ ప్రాంతీయ పార్టీ వరుసగా రెండు సార్లు ఓడిపోతే ఇక ఆ పార్టీ చరిత్రలో కలిసిపోవడమే. ఇప్పటికే ఎన్నో పార్టీలు అలా కలిసిపోయాయి. ఒక్క సారి ఓడిపోయిన బీఆర్ఎస్ పరిస్థితి ఎలా మారిపోతోందో కళ్ల ముందు కనిపిస్తోంది. కానీ టీడీపీ మాత్రం వరుసగా రెండు సార్లు ఓడినా అత్యంత ఘోర పరాజయాలు చవి చూసినా ఎప్పటికప్పుడు ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వస్తూనే ఉంది. 2019లో ఎదురైనా పరాజయంతో ఇక టీడీపీ కోలుకుంటుందా అనే పొజిషన్ నుంచి మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో తామే హాట్ ఫేవరేట్లమని ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలతో నిరూపించుకుంది.
తెలుగుదేశం పార్టీ ఎదుర్కోని సంక్షోభం అంటూ లేదు. తొలి సారి పార్టీ గెలిచినప్పుడే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు.. నాదెండ్ భాస్కర్ రావు దెబ్బకు అధికారం కోల్పోయినంత పనైంది. అయితే అదే పునాదిగా ఎదిగింది. తర్వాత ఎన్నికల్లో ఓటములు వచ్చాయి. అత్యంత ఘోరమైన ఓటములు వచ్చాయి. తాను పెట్టిన పార్టీ తనతోనే అంతమవుతుందని అప్పట్లో ఎన్టీఆర్ అన్నారు కానీ.. టీడీపీ ఇప్పటికీ గట్టిగా నిలబడి పోరాడుతూనే మధ్యలో టీడీపీ పదేళ్లు అధికారానికి దూరమయింది. టీడీపీని నియంత్రించడానికే రాష్ట్ర విభజన చేశారు. దీంతో ఏపీకే పరిమితవ్వాల్సిన పరిస్థితి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్యున్నత సంక్షేమం.. అద్భుతమైన అభివృద్ధి చేశామని అనుకున్నా.. 2019లో దారుణ పరాజయం. మామూలుగా అయితే కుంగిపోవాల్సిన విషయం . కానీ ఐదేళ్లు ఎన్ని సవాళ్లు ఎదురైనా మళ్లీ పార్టీ గాడిలో పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల విజయాల తర్వాత ఆ పార్టీలో ఉత్సాహం పెరిగింది. జూన్ లో టీడీపీ మరో చరిత్ర సృష్టించి.. ప్రాంతీయ పార్టీల చరిత్రలో ఎవరూ ఊహించని ఎత్తులో నిలబడనుంది.