ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితులైన హైదరాబాద్ మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని గుర్తించారు. ట్యాపింగ్ కేసు నమోదవగానే రాధాకిషన్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేయడంతో ఎక్కడ కనిపించినా పట్టుకుంటారని క్లారిటీ రావడంతో గౌరవంగా ఉంటుందని.. సైలంట్ గా హైదరాబాద్ వచ్చేశారు.
రాధాకిషన్‌రావు వచ్చినట్లుగా తెలియగానే విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. ఇన్స్ పెక్టర్ ను కూడా విచారణకు పిలిపించి.. పది గంటల పాటు విచారణ చేసి అరెస్టు చూపించారు. ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులతో పాటు ప్రముఖ వ్యాపారులకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేసి బెదిరింపు చర్యలు, డబ్బులు దండుకోవటం వంటి చర్యలకు పాల్పడినట్టు గుర్తించారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక పరికరాలను ధ్వంసం చేయటంలోనూ వీరు కీలక పాత్ర పోషించారు.
ఈ కేసులో మొదటి ముద్దాయిగా చేర్చబడిన ప్రభాకర్‌రావును ఏ విధంగా అమెరికా నుంచి ఇక్కడకు తీసుకురావాలనే విషయమై సీనియర్ పోలీసు అధికారులు తర్జన, భర్జన పడుతున్నారు. అవసరమైతే ఇంటర్‌పోల్ సాయాన్ని కూడా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక అధికారుల్లో ప్రభాకర్‌రావును విచారిస్తే మరిన్ని ఆధారాలు ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించినవి బయటపడతాయని స్పెషల్ టీం భావిస్తున్నది. అదుపులో ఉన్న రాధాకిషన్‌రావు, గట్టుమల్లుతో పాటు ఈ ఇద్దరు అదనపు ఎస్పీలను కూడా కలిపి విచారించే అవకాశముంది. ప్రభాకర్ రావును అరెస్ట్ చేసిన తర్వాత అప్పటి రాజకీయ బాసుల దగ్గరకు కేసు వెళ్లే చాన్స్ ఉంది.