టీడీపీ యువనేత నారా లోకేష్‌కు జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు . ఏపీ ప్రభుత్వం నారా లోకేష్‌కు చాలా పరిమితమైన సెక్యూరిటీ కల్పించడమే కాదు.. కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ఇటీవల రెండు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఆయన వాహనాలను ఉద్దేశపూర్వకంగా చెక్ చేశారు. ఇదంతా ఓ కుట్ర పూరితంగా జడరుగుతోంది.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం రావడంతో జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలో ఉన్న ప్రభుత్వం.. ప్రభుత్వ వ్యవహారశైలి.. ప్రభుత్వ అధినేతల తీరు అత్యంత క్రూరంగా ఉంటోంది. రాజకీయంగా అడ్డొచ్చే వారిని భౌతికంగా నిర్మూలించాలన్న కసి వారిలో ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుపై ఎన్నో సార్లు రాళ్ల దాడులు జరిగాయి. ఇలాంటి దాడుల్లో ఒకరు చనిపోయారు కూడా. అందుకే ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీని మరింతగా పెంచారు. ఇప్పుడు ఆ క్రూరమైన ఆలోచనలు లోకేష్ మీదకు కూడా మళ్లించినట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు నమ్మడంతో.. సెక్యూరిటీ పెంచారు.
వివేకానంద హత్య కేసు .. అందులో ఉన్న నిందితుల్ని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు… అన్నీ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించాయి. ప్రతిపక్షాలపై చేసిన హింసాత్మక కుట్రలు..దేశాన్ని సైతం ఆశ్చర్యపోయేలా చేశాయి.ఈ క్రమంలో ప్రతి పక్ష నేతలకు.. భద్రతపై కేంద్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.