వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదో మాయా ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. తాను చెప్పేదే కరెక్ట్.. తాను చేసేదే మంచి అనుకుంటూ ఉంటారు. తాను అబద్దాలు చెప్పినా అది ప్రజలే కోసమే అనుకుంటూ ఉంటారు. అందుకే ఎదుటివారు నవ్వుకుంటారన్న కామన్ సెన్స్ లేకుండా నిర్మోహమాటంగా అబద్దాలు ప్రచారం చేసేస్తూ ఉంటారు. అది పాలనలోనే కాదు ప్రచారంలోనూ కనిపిస్తోంది. తన అభ్యర్థులంతా పేదవాళ్లని బీద పలుకులు పలుకుతూ అభ్యర్థుల్ని పరిచయం చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో అభ్యర్థుల్ని పరిచయం చేసినప్పుడు అందరూ పేదవారేనని చెప్పడంతో… ఎదుట ఉన్న వారు కూడా అవాక్కయ్యారు. బుట్టా రేణుక అయితే… స్వయంగా తాను కూడా నవ్వాపుకోలేకపోయారు. ఎందుకంటే తానెంత పేదరాలో ఆమెకు తెలుసు మరి. ఇక ఫ్యాక్షనిస్టులు.. ఊళ్లో వాళ్ల సొమ్మంతా తమదే అని బొక్కేసే నేతల్ని కూడా పేదవాళ్లగానే పరిచయం చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్దాలకు ఇవి మరీ పీక్స్ కు చేరిపోవడంతో… ప్రజలు ఏమనుకుంటారో…అన్న ఇంగితం కూడా జగన్ మర్చిపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఒక్క మాటను కూడా ప్రజలు నమ్మలేని ప రిస్థితులు వచ్చాయి. తనకు పేపర్ లేదంటారు.. టీవీలు లేవంటారు.. ఎదుటి వారికి ఉన్నవేమీ తనకు లేవంటారు… నిజానికి ఆయన ఉన్న వేంటో కళ్ల ముందే ఉన్నాయి. అయినా ఇలా బరితెగించి ప్రజలెవరికీ నిజాలు తెలియదని అనుకుంటూ అబద్దాలు చెప్పుకుంటూ తిరగడం మాత్రం… ఆయన మానసిక స్థితిపై సందేహాలు పెరిగిపోవడానికి కారణం అవుతోంది.