ముందే ఎన్నికలు వస్తాయని ఆశపడిన జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. రెండు నెలలు ఎలా కవర్ చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు. వాలంటీర్లను ఎలాగూ ఈసీ నియంత్రిస్తుందని తలుసు కాబట్టి వృద్ధాప్య పెన్షన్లను లేటు చేసేందుకు పెద్ద ప్రణాళికే వేశారు. ఖాతాల్లో ఉన్న డబ్బులన్నింటినీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారు. కానీ సామాజిక పెన్షన్లు, ఉద్యోగుల జీతాలకు మాత్రం ఆర్బీఐ అప్పుల మీద ఆధారాపడాలనుకుంటున్నారు.
ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన బిల్లులు చెల్లించేస్తున్నరారు. కానీ పెన్షన్లకు మాత్రం నిధులు ఇవ్వలేదు. ఈ సమయంలో వాలంటీర్లపై ఈసీ పెట్టిన రూల్స్ మేరకు.. లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయడం లేదా.. ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేయడం వంటివి చేయాలి. కానీ అందరూ గ్రామ సచివాయాలకు వచ్చి తీసుకోవాలని సెర్ఫ్ ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇలాంటి ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని కూడా పరిమితం చేయాలని ఈసీ సూచించింది. వారు కూడా ఓటర్లను ప్రలోభ పెడతారన్న ఆరోపణలు ఉన్నాయి.
సామాజిక పెన్షన్ల కోసం కనీసం 1900 కోట్లు కావాల్సి ఉంది. కానీ ఖజానాలో నాలుగైదు వందల కోట్లు కూడా లేవని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో… మంగళవారం ఆర్బీఐ వద్ద రూ. నాలుగు వేల కోట్లు అప్పు తీసుకునేందుకు ఇండెంట్ పెట్టుకున్నారు. ఏప్రిల్ కొత్త ఆర్థిక సంవత్సరం కావడంతో.. కొత్త అప్పలకు పర్మిషన్ వస్తుంది. ఈ క్రమంలో ముందస్తు అప్పులకు ఇండెంట్ పెట్టారు. అవి వస్తేనే ఇవ్వగలగుతారు. లేకపోతే లేదు. ఈ మాత్రం దానికే కావాల్సినంత రాజకీయం చేస్తున్నారు.