కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. అయితే కరువు వొచ్చిందని దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని నిందిస్తూ.. బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తోంది. కేసీఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటించారు . ఓ రైతుకు ఐదు లక్షల సాయం కూడా ఇచ్చారు. ఆయన కాంగ్రెస్‌దే కరువు పాపమని నిందించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే.. పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్సే కారణని నిందిస్తూ.. వీడియోలు మీద వీడియోలు చేస్తున్నారు.
అయితే నీరు ఎందుకు అందుబాటులో లేదన్న అంశాన్ని మాత్రం బీఆర్ఎస్ ఎక్కువ చర్చల్లోకి తీసుకు రాకుండా.. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మరీ కాస్త అతిగా ఉన్నప్పటికీ.. వీలైనంత ఎక్కువ మందిని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఎక్కడైనా పచ్చగా ఉంటో ఫోటోలు తీసుకుని కాళేశ్వరం మహిమ అంటున్నారు. అయితే ఇంత త్వరగా కాంగ్రెస్‌ను నిందించడం అనేది రాంగ్ స్ట్రాటజీ అవుతుందనేది చరిత్ర చెప్పిన సత్యం.
ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే వర్షాలుపడలేదు. అందుకే జలాశయాలు నిండలేదు. జలాశయాలు నిండుగా ఉన్నప్పుడుకూడా కృష్టా డెల్టాకు ఇబ్బందికర పరిస్థితులు కేసీఆర్ హయాంలో ఉన్నాయి. ఆయినా బీఆర్ఎస్ కు ఇప్పుడు కరువు ఒక్కటే ఆయుధంగా కనిపిస్తోంది. ఎంత మేర ఈ కరువు రాజకీయంగా ఆదుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.