పదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల రాజకీయంలోకి వస్తున్నారు. బీజేపీ నుంచి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి 2009 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటుతో పీలేరులో పోటీ చేసిన ఆయన 56,636 ఓట్లు సాధించారు. ఆ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకుని, మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. గత ఏడాది బీజేపీలో చేరిపోయారు. 2024 ఎన్నికలకు రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయడానికి రంగంలోకి దిగారు.
పీలేరు నియోజకవర్గంలో నల్లారి కుటుంబంతో చింతల కుటుంబం మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతూ ఉంటుంది. అందుకు సమాంతరంగానే జిల్లాలో చక్రం తిప్పే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ఏమాత్రం తక్కువ కాదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, న్నల్లారి కుటుంబం ఉప్పు నిప్పులా ఉంటారు. 1972 నుంచి చింతల రామచంద్రారెడ్డి కుటుంబం. ఆ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ఇదే తరహా వైరం ఉంది.
కాంగ్రెస్ పార్టీలో.. 1989 నుంచి 24 వరకు అనేక రాజకీయ పదవులను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనుభవించారు. అన్న సీఎం అయ్యాక తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రాబల్యం పెంచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నల్లారి కిషోర్ టీడీపీలో చేరారు. ఈ చేరిక నల్లారికి కిరణ్కు ఇష్టం లేదని చెబుతారు. ఇప్పుడు టీడీపీ మద్దతుతోనే రాజంపేటలో పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజంపేట పార్లమెంటు స్థానంలో బిజెపి ప్రాబల్యం తక్కువగానే ఉంటుంది. అయితే బిజెపి జనసేన టిడిపి కూటమి కావడం వల్ల.. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నియోజకవర్గాల్లో టిడిపి ఓటు బ్యాంకు పైనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆశలు ఉంచుకున్నారు.
రాజంపేట శాసనసభ స్థానంలో టిడిపి కాస్త బలం ఉందని చెప్పవచ్చు. రైల్వే కోడూరు టిడిపి కోటలో జనసేన అభ్యర్థి తెరమీదకి వచ్చారు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. రాయచోటి నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నుంచి సహకారం అందవచ్చు. నాటి కాంగ్రెస్ పార్టీ తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీలో రాంప్రసాద్ రెడ్డి కీలకంగా ఉన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టిడిపి వర్గపోరుతో సతమతమవుతోంది. మదనపల్లి నియోజకవర్గం పెద్దిరెడ్డి గ్రూపులే ఎక్కువైనది సందేహం లేదు. ఇక టిడిపి అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న షేక్ షాజహాన్ బాషా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కిరణ్ కుమార్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. పీలేరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పీలేరు నియోజకవర్గాన్ని పులివెందులతో పోటీపడి మరి సీఎంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధి చేశారు జాతీయ సంస్థలను నెలకొల్పారు. నల్లారి కుటుంబంపై నియోజకవర్గంలో సానుభూతి కనిపిస్తోంది. పుంగనూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంచుకోటగా మారింది.
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి అభ్యర్థులే గత ఎన్నికల్లో గెలుపొందారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి పెద్దిరెడ్డికి ఉన్న వైరం ఈ నాటిది కాదు. అలాంటిది కుమారుడిపై పోటీ చేస్తున్న నల్లారిని ఓడించడానికి పెద్దిరెడ్డి ఏమైనా చేస్తారని చెప్పక తకప్పదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొదటిసారి 2014లో పురందేశ్వరి పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో డిఏ సత్యప్రభ మెజార్టీ పెంచుకున్నారు. ఈ సారి కిరణ్ ఎలాంటి పోటీ ఇస్తారో చూడాల్సి ఉంది.