నిర్మాతలంతా దాదాపు ఒకేరకమైన స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు. హిట్ హీరో, ఫామ్ లో ఉన్న దర్శకుడు కనిపించగానే అడ్వాన్సులు చేతిలో పెట్టేస్తారు. ‘ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సినిమా చేస్తే చాలు’ అనేది వాళ్ల ఊతపదం. కొంతమంది నిర్మాతలు ఈ విషయంలో మరింత అడ్వాన్డ్స్‌గా ఉంటారు. మైత్రీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి సంస్థలైతే… దాదాపు ప్రతీ ఒక్కరి చేతిలోనూ అడ్వాన్సులు పెట్టేశారు. అయితే దిల్ రాజు మాత్రం ఇలాంటి యవ్వారాలకు దూరం. ఆయన ఇప్పటి వరకూ ఏ హీరోకీ అడ్వాన్సే ఇవ్వలేదట. సినిమా మొదలైన్పపుడు కొంత, మధ్యలో కొంత, పూర్తయ్యాక మిగిలిన సొమ్ము ఇవ్వడం దిల్ రాజు స్టైల్. అంతే తప్ప, అడ్వాన్సులు ఇచ్చి, బుక్ చేసుకోవడం ఉండదట. ఈ విషయం దిల్ రాజే చెప్పారు. అయితే ఆయన కెరీర్లో మొదటి సారి ఓ హీరోకి అడ్వాన్స్ ఇచ్చారు. ఆ హీరో విజయ్ దేవరకొండ. కరోనా సమయంలో.. విజయ్‌కి డబ్బులు అత్యవసరం అయితే, దిల్ రాజు అడ్వాన్స్ రూపంలో అడ్జస్ట్ చేశారు. ఇప్పుడు ఆ అడ్వాన్సుతోనే ‘ఫ్యామిలీస్టార్’ సినిమా మొదలెట్టి, పూర్తి చేశారు.
నిజంగానే అడ్వాన్సులతో కట్టిపడేసే ఈ పరిశ్రమలో హీరోలకు అడ్వాన్సులు ఇవ్వకపోవడం విచిత్రంగా తోస్తోంది. అయినా దిల్ రాజు బ్రాండ్ వాల్యూ అలాంటిది. ఆయన ముందు కథలతో కట్టి పడేస్తాడు. దిల్ రాజు నుంచి ఓ కథ వచ్చిందంటే అందులో కచ్చితంగా విషయం ఉండే ఉంటుందని హీరోలు నమ్ముతుంటారు. ఓ హీరో స్థాయికి మించి పారితోషికాలు ఇచ్చిన సందర్భాలు
కూడా దిల్ రాజు కెరీర్లో కనిపించవు. నిర్మాతగా ఇలాంటి ప్రమాణాలు పాటించడం చాలా అరుదనే చెప్పాలి.