వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికే అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. ఇందు కోసం పూర్తి స్థాయిలో స్క్రిప్టెడ్ టూర్ నిర్వహిస్తున్నారు. తొలి రెండు రోజులు.. గంటన్నర సేపు .. సాయంత్రం పూట.. చీకటి పడక ముందే ప్రసంగించారు. కానీ తర్వాత అసలు ప్రసంగాల జోలికి పోవడం లేదు. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో యాత్ర చేస్తున్నా ఆ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించడం లేదు. కానీ ఆయన బస్సు చుట్టూ …కొన్ని స్కిట్ల షూటింగ్ మాత్రం యథావిధిగా జరుగుతోంది.
జయలలిత కంటే.. తనను ఎక్కువమంది ప్రజలు దైవదూతగా చూస్తున్నారని నమ్మించేందుకు జగన్ రెడ్డి అండ్ కో .. ఐ ప్యాక్ క్రియేటివ్ టీం చేస్తున్న ప్రయత్నాలు.. ఆ వీడియోలూ చూసిన వారిని పగలబడి నవ్వేలా చేస్తున్నాయి. ఎక్కడైనా వంతెనపై వెళ్లేటప్పుడు… ఓ నలుగురు ,ఐదుగురుకి.. పార్టీ జెండాలు ఇచ్చి పొర్లు దండాలు పెట్టిస్తున్నారు. వారు అలా దండాలు పెడుతూంటే… జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుతో దండం పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఆయన వాళ్లకి తానేదో సిరిసంపదలు ఇచ్చేశానని అందుకే వారు అలా దండాలు పెట్టేస్తున్నారని అన్నట్లుగా ఆయన ముఖ కవళికలు చూపిస్తున్నారు. వారు అలాగే దండాలు పెట్టి ఉండిపోవడం లేదు. బ స్సు వెనుక కొంత దూరం పెరుగెత్తుతున్నారు.
నిజానికి ఇలాంటివి సెక్యూరిటీ అసలు అంగీకరించదు. కానీ స్క్రిప్టెడ్.. ముందే చెప్పి ఉంటారు కాబట్టి… నడిచిపోతుంది. ఇది స్కిట్లలో ఒకటి మాత్రమే. ఇంకా వికలాంగుల్ని తీసుకొచ్చి కొన్ని సీన్లు షూట్ చేస్తున్నారు. కొంత మంది మహిళలు, యూట్యూబ్ లో కాస్త ఫాలోయింగ్ ఉన్న వాళ్లను తీసుకొచ్చి కొత్త కొత్త కాన్సెప్టులతో సోషల్ మీడియా కోసం షూట్ చేస్తున్నారు. ఈ వీడియోలను చూసి.. వైసీపీ శ్రేణులు.. కూడా నవ్వుకుంటున్నాయి.
ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క సారి కూడా ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. చివరికి ఎన్నికలకు ముందు డ్రామా యాత్ర నిర్వహిస్తున్నారు. కొసమెరుపేమిటంటే… యాత్రలో ఐ ప్యాక్ స్కిప్టుల వీడియోలకు అప్పుడప్పుడు ఇతరులు ఆటంకం కలిగిస్తున్నారు. ఖాళీ బిందెలతో మహిళలు.. నిరుద్యోగులకు ఇచ్చిన డిమాండ్లతో నిరుద్యోగులు .. ఇలా వివిధ వర్గాలు నిరసన చేపట్టేందుకు వస్తున్నారు. ఇవే ఎక్కువ వైరల్ అవుతున్నాయి.