ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఆయన తాను అసంతృప్తికి గురయ్యానని లీకులు ఇస్తున్నారు. ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని అనుచరులతో చెప్పిస్తున్నారు. దీనికి కారణం పోటీ చేయడానికి సీటు కేటాయించకపోవడమే.
పొత్తుల్లో భాగంగా ఈ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ లేదా సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ స్థానాలు బీజేపీకి దక్కలేదు. ఆనపర్తి దక్కింది. అక్కడ్నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు కానీ ఆయన అయన ఆసక్తి చూపించలేదు. రాజమండ్రి పార్లమెంట్ అయినా సరే తనకు కావాలనుకున్నారు. పురందేశ్వరికి అవకాశం దక్కింది. తనంతటి సీనియర్ హోంగ్రౌండ్లో తనకు కాకుండా పురందేశ్వరికి ఇస్తారా అని ఆయన అలిగారు.
బీజేపీలో చాలా కాలం నుంచి నుంచి సోము వీర్రాజు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది తక్కువే. పొత్తుల్లో భాగంగా 2004లో కడియం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలవలేదు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం బీజేపీ కీలక నేతగా ఎదిగారు. 2014లో టీడీపీతో పొత్తులు పెట్టుకున్న సమయంలో రాజమండ్రి సిటీ స్థానం బీజేపీకి వచ్చింది. అప్పుడు సోము వీర్రాజు పోటీ చేసే అవకాశం వచ్చినా.. డబ్బులు తీసుకుని ఆకుల సత్యనారాయణ అనే నేతకు సీటు కేటాయింప చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
తర్వాత ఆయనకు టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఆయన జీవితంలో ప్రజాప్రతినిధిగా అదే మొదటి సారి. ఆ పదవి కాలం పూర్తయింది. ఇప్పుడు ఆయన బుంగమూతి పెట్టడానికి కారణం పోటీ చేయడానికి సీటు కాకపోయినా.. ఎమ్మెల్సీ లాంటి పదవి హామీ కోసమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ పదవులు ఇస్తే.. టీడీపీనే తిట్టి వైసీపీకి ఊడిగం చేసే ఆయనకు ఈ సారి అలాంటి ప దవులేమీ రావన్న అభిప్రాయం వినిపిస్తోంది.