ఏపీలో పెట్రేగిపోతున్న జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులకు ఈసీ మొదటి షాక్ ఇచ్చింది. ఓ ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెకర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా.. పాలనలో జీ హుజూర్ అంటూ..అడ్డగోలు పనులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నవారే. కోడ్ వచ్చిన తర్వాత కూడా వారు మారలేదు.
గుంటూరు రేంజ్ IG పాలరాజు.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెబితే అదే వేదం అన్నట్లుగా ఉంటారు. ఆయనను ఈసీ పక్కన పెట్టింది. ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్ , నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. . ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చిలూకలూరిపేటలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న బహిరంగసభలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా విధుల్లో ఉండాల్సిన ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సభను విఫలం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఈవో నివేదికను.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజకీయ హింస పలు జిల్లాల్లో చోటు చోసుకుంది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు చోటు చేసుకున్నాయి. అలాగే పల్నాడు జిల్లాలోని మాచర్లలో దాడులు చోటు చేసుకున్నాయి. ఈ మూడు ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ముగ్గురు కలెక్టర్లపైనా ఈసీ బదిలీ వేటు వేసింది. కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లపైనా వేటు వేసింది. వీరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే అనేక ఫిర్యాదులు టీడీపీ చేింది.
బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేిసంది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఇది మొదటి విడతేనని.. తర్వాత అసలైన షాకులుంటాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.