రఘురామకు సీటు, ఆనపర్తి టీడీపీకి వెళ్లడం ఖాయమన్నప్రచారం ఊపందుకోవడంతో… ప్రో వైసీపీ .. బీజేపీ లీడర్లు ఒళ్లు విరుచుకుంటున్నారు. తమకు సీటు దక్కినా దక్కకున్నా.. తమ అభిమాన పార్టీ ఎజెండాను అమలు చేసేందుకు కొంతమందికి సీట్లు దక్కకుండా చేసేందుకు పావులుగా తెరపైకి వస్తున్నారు. ఇలాంటి వారిలో జీవీఎల్ ముందు ఉంటారు.
నర్సాపురం, ఆనపర్తి సీట్లను టీడీపీకి కేటాయిస్తున్నందున.. విశాఖను బీజేపీకి కేటాయించాలని ఆయన రాజకీయం ప్రారంభించారు. వైసీపీ కూలి మీడియాలో కొన్ని చానళ్లలో.. విశాఖ సీటును జీవీఎల్ కు ఇవ్వకపోతే.. ఓటింగ్ కు దూరంగా ఉంటామని ఉత్తరాది ప్రజల సంఘాలు హెచ్చరించినట్లుగా ప్రచారం చేయించుకున్నారు. బీజేపీని జీవీఎల్ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేశారని చెప్పుకుంటున్నారు. వీకెండ్స్ లో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి… కేంద్ర సంస్థల సీఎస్సార్ నిధులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం తప్ప ఆయనేం చేశారో లోకల్ బీజేపీ నేతలకే తెలియదు. కానీ ఆయన వైసీపీ ముఖ్య నేతల ప్రోత్సాహంతో నార్త్ ఇండియన్ల పేరుతో బ్లాక్ మెయిల్ ప్రారంభించేశారు.
బీజేపీ నార్త్ ఇండియన్ల పార్టీనా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆయన తీరు బీజేపీలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీ కోసం నార్త్ ఇండియన్లు డిమాండ్ చేస్తున్నారంటే.. లోకల్ పీపుల్ వద్దంటున్నట్లా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలో అధికార పార్టీకి .. బీజేపీలో ఉంటూ పని చేసిన జీవీఎల్.. అసలు పోటీ చేయాలని అనుకోకూడదని .. కానీ బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.