ఐపీఎల్ 17వ సీజన్ లో కూడా ఆర్సిబీ జాతకం మారినట్లుగా కనిపించడం లేదు. ఒక మ్యాచ్ గెలిచి ఆశలు రేపిన జట్టు.. వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది. ఇప్పటికే నాలుగు మ్యాచులు అయిపోయాయి. కేవలం రెండు పాయింట్లతో రేసులో వెనకబడిపోయింది. రేసులో వుండాలంటే ఇకపై ఆడే మ్యచులన్నీ గెలవాలి. లేదంటే కష్టం.
ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండిట్లో విఫలమౌతుంది ఆర్సిబీ. బ్యాటింగ్ లో కేవలం విరాట్ కోహ్లి మీదే ఆధారపడుతోంది. స్టార్ ప్లేయర్లు డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్ విఫలమౌతున్నారు. కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్ దేశం కోసం అద్భుతంగా రాణించారు. కానీ ఈ లీగ్ లో దారుణంగా ఆడుతున్నారు. అసలు బంతిని టైం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. విరాట్ ఆడితేనే గెలుస్తారనే తీరు ఆ టీంలో వుంది. టీం అంతా ఒక్కడిపైనే ఆధారపడటం మంచి కాదు. ఇలా అయితే టైటిల్ కొట్టడం కష్టం. ఎంత స్టార్ ప్లేయర్ అయిన ప్రతి మ్యాచ్ ని వంటిచేత్తో గెలిపించలేడు.
ఇక ఆర్సీబీ బౌలింగ్ ఇంకా దారుణం. సిరాజ్ బౌలింగ్ పలకడం లేదు. మిగతా బౌలర్స్ అసలు ఫామ్ లోనే లేరు. ఒక్క బౌలర్ కూడా మెరుపు వేగంగా బంతులు విసిరి బ్యాట్స్ మెన్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఇదే పేలవమైన ఆట తీరు ప్రదర్శించే తొలిదశలోనే లీగ్ నుంచి నిష్క్రమించే జట్టు ఆర్సిబీనే అవుతుంది.