పవన్ కల్యాణ్ వారాహి బయటకు తీయడం ఏమిటో కానీ.. పరుగులు పెట్టడం కన్నా.. బ్రేకులు పడటమే ఎక్కువ అయింది. చాలా రోజుల విరామం తర్వాత ఎన్నికలు అయిపోయే వరకూ ప్రచారం చేయాలని పిఠాపురం నుంచి ప్రారంభిస్తే.. జ్వరం ఆయనను ఇబ్బంది పెడుతోంది. పిఠాపురంలో ప్రచారం ప్రారంభించిన రోజునే జ్వరం వచ్చింది. ఎలాగోలా ఒక్క రోజు విశ్రాంతి తీసకుని ప్రచారం చేసినా మళ్లీ తిరగబెట్టింది. దాంతో తెనాలి నుంచి జరగాల్సిన ఇతర నియోజకవర్గాల ప్రచారాన్ని వాయిాద వేసుకున్నారు.
ముందుగా అనుకున్న దాని ప్రకారం మడో తేదీన తెనాలి.. నాల్గో తేదీన నెల్లిమర్ల, ఐదో తేదీన అనకాపల్లి, ఆరున యలమంచలి, 7న పెందుర్తిలో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. అక్కడ కూడా రోడ్‌షోలు, బహిరంగ సభల్లో ప్రసగించనున్నారు. వారి విజయానికి కూటమి నేతలు సహకరించేలా వారితో భేటీ కావాల్సి ఉంది. ఏడో తేదీన ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని కాకినాడ కు చేరుకుని కోస్తా జిల్లాల్లో ప్రచారం 8 నుంచి ప్రారంభించాలని ్నుకున్నారు. 9వ తేదీన ఉగాది రోజున పిఠాపురంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత కోనసీమ జిల్లాల్లోకి ప్రవేశించేలా చూసుకున్నారు. ఇలా పన్నెండో తేదీ వరకూ ప్రచారం ప్లాన్ చేశారు. జ్వరం కారణంగా మొత్తం షెడ్యూల్ అప్ సెట్ అయింది.
పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్దప్రసాద్, నిమ్మక జయకృష్ణ పేర్లను ఖరారు చేశారు. దీంతో అన్నిస్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఇక ప్రచారాన్ని పూర్తి స్థాయిలో చేపట్టడమే మిగిలింది. పవన్ పర్యన రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభించేందుకు జనసేన వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారు.