పించన్ల పంపిణీని వైసీపీ రాజకీయ అవసరాల కోసం గందరగోళంగా మార్చిన సీఎస్ జవహర్ రెడ్డిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఓ గట్టి కారణం కోసం చూస్తున్న టీడీపీ నేతలు వెంటనే ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కూడా పించన్లు పంపిణీ చేయలేదని ఆధారాలు సమర్పించారు.
వృద్ధులకు.. నడవలేని వారికి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తామని మార్గదర్శకాల్లో పాల్గొన్నారు. కానీ చాలా చోట్ల సచివాలయ ఉద్యోగులు.. పించన్ల కోసం తీసుకు రావాలని ఫోన్లు చేశారు. ఇదే సందనుకుని వైసీపీ నేతలు.. మంచాల మీద వృద్ధుల్ని ఊరేగించి తీసుకెళ్లారు. ఈ వీడియోలు సంచలనంగా మారాయి. వెంటనే ఈసీకి ఫిర్యాదు వెళ్లింది. నిజానికి పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేయడం గంటలో పని. సినిమా టిక్కెట్లను అమ్మడానికి రెవిన్యూ ఉద్యోగుల్ని పెట్టిన ప్రభుత్వానికి ఆ తెలివి ఉంది. కానీ వారికి కావాల్సింది కొన్ని వృద్ధుల శవాలు. అందు కోసం సీఎస్ సహకరించారు.
చీఫ్ సెక్రటరీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈసీ ఆయనపై రెండు, మూడు రోజుల్లో చర్యలుతీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క పెన్షన్ల విషయంలోనే కాదు.. రాజకీయ పరమైన కారణాలతో… ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా నిర్ణయం తీసుకుని..తప్పుడు ప్రచారాల కోసం చాన్స్ ఇస్తున్నారన్న కోణంలోనూ ఆయనపై ఫిర్యాదులు వెళ్లాయి.