రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రజనీ – లోకేష్‌ల కాంబోలో తొలి సినిమా ఇది. హీరోల్ని లోకేష్ చూపించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్ మీటర్ బాగా తెలిసిన దర్శకుడాయన. మాస్ కి, స్టైల్ కీ కేరాఫ్ అడ్రస్ అయిన రజనీని ఎలా చూపిస్తాడో అంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బంగారం స్మగ్లింగ్‌కి సంబంధించిన కథ ఇది. ఈ సినిమా కోసం పలు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ‘తలైవా’ టైటిల్ ఖాయమంటూ.. ఫ్యాన్స్ తమ సృజనాత్మకత ఉపయోగించి పోస్టర్లు కూడా తయారు చేసేశారు. అయితే ఈ సినిమాకు ‘కళుగు’ అనే పేరు ఖాయం చేశారని తెలుస్తోంది. ‘కళుగు’ అంటే ‘గద్ద’ అని అర్థం. అన్ని భాషల్లోనూ ఈ సినిమాను ‘కళుగు’ పేరుతోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 22న టైటిల్ ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించబోతోంది. ఈనెలాఖరున ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. కథానాయిక, ఇతర వివరాలు కూడా అప్పుడే ప్రకటిస్తార.