హీరో అజిత్‌కు డూప్ లేకుండా స్టంట్స్ చేయడం ఇష్టం. ముఖ్యంగా తనకి బైక్ రేసింగ్ అంటే పిచ్చి. సినిమాల్లో రేసింగ్ సీన్స్ వుంటే ఆయన స్వయంగా చేస్తాడు. ఇక యాక్షన్ సీన్స్ లో కూడా డూప్ లేకుండా దిగుతాడు. పలు సందర్భాల్లో గాయాలు కూడా అయ్యాయి. కానీ ఆయన మాత్రం రియల్ స్టంట్స్ చేయడానికే మొగ్గు చూపుతాడు. తాజాగా ఆయన చేసిన ఓ రిస్క్ స్టంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైయింది. ప్రస్తుతం ‘విదా ముయార్చి’లో నటిస్తున్నాడు అజిత్. ఇందులోని యాక్షన్ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో అజిత్ డూప్ లేకుండా నటించడంతో ఆయనకు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోని నిర్మాణ సంస్థ షేర్ చేసింది. అజిత్ ఫాస్ట్‌గా కారు చేస్తుండగా, కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ వీడియో చూసిన జనాలు కొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం ఇలాంటి రిస్కలు వద్దని కోరుతున్నారు. నిజమే.. సినిమా అనేది హీరో మీడియం. హీరోని నమ్మే నిర్మాతలు కోట్లు ఖర్చు చేస్తారు. ఇలాంటి రిస్కలు వలన ప్రమాదాలు జరిగి షూటింగ్ అలస్యమైతే నిర్మాతలు ఆర్ధిక ఇబ్బందులు పడతారు. అందుకే స్టంట్స్ సీన్స్ లో డూప్ కే ప్రాధాన్యత ఇస్తారు. అజిత్ లాంటి హీరోలు మాత్రం ఇలాంటి సాహసాలు చేసి తమతో పాటు నిర్మాతలు, అభిమానులని కూడా టెన్షన్ పెడుతున్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడితే మంచిది.