ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలుచేస్తున్నారు. తన కుమారుడి పరీక్షలు ఉన్నందున్న మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని… ఈ సమయంలో తాను పక్కన ఉండటం అవశక్యం అని, లేదంటే కుమారుడి పరీక్షలపై ప్రభావం పడుతుందని కవిత పేర్కొన్నారు.
కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్బంగా ఈడీ సీరియస్ గా స్పందించింది. లిక్కర్ పాలసీలో కవితే కింగ్ పిన్ అని.. ఆమె బయటకు వెళ్తే ఆధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని కోర్టుకు వివరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
కవిత బెయిల్ పిటిషన్ పై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపొందించి.. ఈ కేసులో బయటపడేందుకు కొడుకును లాగుతన్నారని సెటైర్లు పేలుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని కుటుంబానికి దూరం చేశారు.. అప్పుడు గుర్తు రాలేదా..? ఇలాంటి విషయాలు అని కామెంట్స్ చేస్తున్నారు.