ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు వేయడం ఖాయమని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రస్తుతం డీజీపీగా ఉన్నారు కానీ అది ఇంచార్జ్ హోదాలోనే. ఆయన పర్మినెంట్ డీజీపీ కాదు. మనం మనం బరంపురం స్టైల్ లో.. జగన్ మోహన్ రెడ్డి.. ఆయనను సీనియార్టీ జాబితాలో ఎక్కడో ఉంటే తెచ్చి డీజీపీగా పెట్టుకున్నారు. యూపీఎస్సీ రూల్స్ ప్రకారం.. కొత్త డీజీపీ నియామకానికి పేర్లు పంపాల్సి ఉన్నా పంపలేదు. యూపీఎస్సీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం పట్టించుకునే అవకాశం ఉంది. ఇంచార్జ్ డీజీపీ నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపించడం లేదు.
ఆయనను తప్పిస్తే.. సీనియర్ ఐపీఎస్‌ల జాబితాలో ఏబీ వెంకటేశ్వరరావు ముందు ఉంటారు. కానీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు గత నాలుగేళ్లుగా సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన చేసిన తప్పేమిటో నిరూపించలేదు. ఆయనపై పెట్టిన కేసుల్ని నిరూపించలేదు. పైగా ఆయనపై కుట్ర చేశారన్నదానికి ఆధారాలను ఆయన కోర్టుకు..క్యాట్ కు సమర్పించారు. సస్పెన్షన్ ఎత్తి వేయాలని హైకోర్టు.. సుప్రీంకోర్టు చెప్పినా సస్పెన్షన్ ఎత్తి వేసి.. మళ్లీ సస్పెన్షన్ వేటు వేశారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరిగింది. ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ఏపీ సర్కార్ సిఫారసు చేసింది. ఆయన తప్పేమీ చేయలేదని దాన్ని కేంద్రం తోసి పుచ్చింది.
ఈ నెల 13న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ క్యాట్‌లో ఏబీవీ సస్పెన్షన్ పై విచారణ జరుగుతుంది. ఆ రోజున సస్పెన్షన్ ఎత్తి వేస్తూ క్యాట్ నిర్ణయం తీసుకుని ఆయనకు జరిగిన అన్యాయాన్ని సరి చేయాలనుకుంటే… సీన్ మారిపోతుంది. డీజీపీని బదిలీ చేశాక .. సీనియర్ల పేర్లు పంపాల్సి ఉంటుంది. ఆ సీనియర్లలో మొదటి పేరు ఏబీ వెంకటేశ్వరరావుది ఉంటుంది. ఏబీవీ రిటైర్మెంట్ మే నెలాఖరును ఉంది. అయితే అప్పటికీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. కానీ ప్రభుత్వం ఏర్పడదు. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది కీలకంగా మారింది.