రణ్బీర్ కపూర్ రాముడిగా.. .సాయిపల్లవి సీతగా నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న పురాణేతిహాసం ‘రామాయణ’. యశ్ రావణుడిగా కనిపిస్తారు. భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ. పలు భారతీయ భాషల్లో.. మూడు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీరామనవమి రోజైన ఏప్రిల్ 17న ప్రకటించే అవకాశముంది. అయితే ఈ లోగ ఈ సినిమా చుట్టూ బోలెడన్ని ఆసక్తికరమైన కబుర్లు నడుస్తున్నాయి. ఈ మూవీ తెలుగు వెర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అప్పగించినట్లు ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ కు పురాణాలపై పుష్కలమైన పరిజ్ఞానం వుంది. నిజంగా ఆయన రాయాలే కానీ ఈ ప్రాజెక్ట్ కి అదొక ప్రత్యేక ఆకర్షణ.
మరో కబురు ఏమిటంటే.. ఈ సినిమాకి సంగీతం సమకూర్చే బాధ్యతని ఏఆర్ రెహ్మాన్, హాలీవుడ్ కంపోజర్ హ్యన్స్ జిమ్మర్ కి అప్పగించినట్లు బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇది కూడా చాలా క్రేజీ కాంబినేషన్. రెహ్మాన్ గురించి అందరికీ తెలుసు. హ్యన్స్ జిమ్మర్ విషయానికి వస్తే.. హాలీవుడ్ లెజెండరీ కంపోజర్. బోలెడు ఆస్కార్ అవార్డులు వున్నాయి ఆయనకి. క్రిష్టఫర్ నోలన్ సినిమాలని ఇష్టపడే వారికి జిమ్మర్ ఇంకా బాగా పరిచయం. డార్క్ నైట్, బ్యాట్ మెన్, ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లర్ ఈ సినిమాలన్నిటినీ స్కోర్ చేసింది హన్స్ జిమ్మరే. అలాంటి ఆయన ప్రాజెక్ట్ లోకి వస్తే.. సినిమా స్కేల్ మరోస్థాయిలో వుంటుంది. ఐతే ప్రస్తుతానికి ఈ వార్తలపై అధికారిక ప్రకటన లేకపోవడంతో రూమర్స్ గానే చూడాలి.