సమయం : 2019 ఎన్నికలు
జగన్మోహన్ రెడ్డిని గెలిపించానికి ఓ వైపు తల్లీ , చెల్లి బయలుదేరేవారు. మరో వైపు ముగుసులో రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్లు సభలు పెట్టేవాళ్లు.. మరో బ్యాచ్ చంద్రబాబుపై కులం బురద పూస్తూతిరుగుతూ ఉండేది. ఇంకో బ్యాచ్ అమరావతిపై విషం చిమ్ముతూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి మాత్రం వరీందర్నీ చిద్విలాసంగా చూస్తూ.. రోజు మార్చి రోజు ప్రచారం చేస్తూ ఉండేవారు. అందరి కృషి ఫలించి.. జగన్మోహన్ రెడ్డి పీఠం ఎక్కారు. ఐదేళ్లు గిర్రున తిరిగి పోయాయి. మరి ఇప్పుడు ?
2024 ఎన్నికల్లో జగన్ కోసం ఎవరున్నారు ?
జగన్మోహన్ రెడ్డి కోసం ఆయనే సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. మూడు రోజులకో సారి బస్సు యాత్రకు విరామం ఇచ్చి అలుపు తీర్చుుంటున్నారు. ఆయన కోసం తల్లీ ప్రచారం చేయదు. చెల్లెలు అయితే నేరుగా జగన్ ను ఓడించమని రివర్స్ లో ప్రచారం చేస్తోంది. ఇక అప్పట్లో బాకా ఊది.. చంద్రబాబు మీద బురద చల్లి కుల ఉద్రేకాలు రెచ్చగొట్టిన రిటైర్డ్ ఆఫీసర్లందరికీ జగన్ సరైన ట్రీట్ మెంట్ ఇవ్వడంతో వారంతా కుంగిపోతున్నారు. అజేయకల్లాం లాంటి వాళ్లు చివరికి వివేకా హత్య కేసులో పావులుగా మారాల్సి వచ్చింది. చివరికి ఆయనకోసం గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఫృధ్వీ కూడా లేరు. అలీ కూడా ప్రచారం చేయడం కన్నా.. సొంత పనులు చేసుకోవడం మంచిదని లైట్ తీసుకుంటున్నారు.
కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు యొదుగూరి సందింటి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న వార్తే బయటకు రాలేదు. ఇప్పుడు కుటుంబసభ్యులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అధికారంతో సంబంధం లేకుండా ఎంతో మంది ఆత్మీయులు జగన్ చుట్టూ ఉండేవారు. ఆయనను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పని చేసేవారు. వారు ఎలాంటి వారు..ఎంత మంది ఉంటారనేది.. బయట వారి కన్నా.. అక్కడ ఉండే వారికి తెలుసు . కానీ ఇప్పుడు వారిలో ఎంత మంది జగన్ ఇంటి దగ్గర ఉంటున్నారు ?. ఎవరూ లేరు. అందరూ దూరమయ్యారు.. ఒక్క సజ్జల మాత్రమే ఉన్నారు. ఆయన ఒక్కడే ఎందుకున్నారంటే.. అదే ఆయనచేస్తునన రాజకీయం
గెలిచి సర్వం కోల్పోయిన జగన్
కుటుంబం.. పార్టీ .. ఆత్మీయులు.. కార్యకర్తలు అందరూ ఒక్కొక్కరుగా దూరమయ్యారు. సజ్జల మాత్రమే దగ్గరయ్యారు. జగన్ అంటే ఇప్పుడు సజ్జల మాత్రమే కనిపిస్తున్నారు. అది కుటుంబ విషయాలైనా.. పాలనా విషయాలైనా.. మరొకటైనా.. జగన్ మాత్రం ఒంటరి అయిపోయారు. నమ్మిన వాళ్లందర్నీ నట్టేట ముంచారు..