ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ మేరకు మేనిఫెస్టోలోనూ పెట్టింది. అసలు ప్రత్యేకహోదా ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీనే. విభజన చట్టం చేసినప్పుడు ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు. అయితే బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రత్యేకహోదా సంగతిని పక్కన పెట్టేశారు. రాజకీయ ఆటలు ఆడారు. ఇప్పటికీ బీజేపీ ఆ హోదా సంగతి చెప్పడం లేదు. ముగిసిన అథ్యాయం అంటోంది. ఆ అధ్యాయాన్ని మళ్లీ తెరుస్తామని కాంగ్రెస్ అంటోంది.
అసలు ప్రత్యేకహోదా అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. నిపుణులు పేరుతో అనేక మంది అనేక రకాలుగా విశ్లేషిస్తారు. పాలనా మేధావి జగన్మోహన్ రెడ్డి అయితే ఇన్ కం ట్యాక్స్ ఉండదని.. అదే వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందనేవారు. మరి అధికారంలోకి వచ్చాక అదే తీసుకు వస్తే మూడు రాజధానులతో మూడు ప్రాంతాల్లోనే అభివృద్ధి చేయాల్సిన డౌట్ ఎవరికీ కాదు.కానీ ప్రత్యేకహోదాను ఆయనకు మాత్రమే తెచ్చుకున్నారు. కేసులు సాగకుండా… చూసుకున్నారు.
ఇప్పుడు బీజేపీ, టీడీపీ హోదా తెస్తామని చెప్పడంలేదు. ఇస్తామని చెప్పడం లేదు. కానీ జగన్ రెడ్డి మాత్రం… మోసం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యాప్తంగా గొప్ప పరిస్తితి ఉందని అనుకోవడం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని భావోద్వేగాల ద్వారా కొంత కాలం మార్చగలరేమో కానీ ప్రతీ సారి కాదన్న నమ్మకంతో ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. అందుకే … కాంగ్రెస్ వస్తుంది.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తుందని ఏపీ ప్రజలు ఆశాభావంతో ఉండాలేమో ?