‘జిల్‌’ కాంబో మ‌ళ్లీ!

‘జిల్‌’తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా యూవీ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఆ త‌ర‌వాత యూవీలోనే ‘రాధే శ్యామ్’ రూపొందించాడు రాధాకృష్ణ‌. ఇప్పుడు మ‌రోసారి అదే సంస్థ‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. ఈసారీ గోపీచంద్ తోనే. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌లో రూపొందించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా పూర్త‌యిన‌ట్టే. ఈవారంలోనే గోపీచంద్‌కు ఫైన‌ల్ నేరేష‌న్ ఉంది. అంతా ఓకే అనుకొంటే… ఈ యేడాదే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తారు. గోపీచంద్ ఇటీవ‌ల `భీమా`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆ సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చినా, మాస్ సినిమా కాబ‌ట్టి వ‌సూళ్లు బాగానే దండుకొంది. గోపీచంద్ గ‌త సినిమాల‌తో పోలిస్తే ‘భీమా’ క‌మ‌ర్షియ‌ల్ గా బాగానే పే చేసిన‌ట్టు లెక్క‌. మ‌రోవైపు శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్‌పై ఉంది. శ్రీ‌నువైట్ల త‌ర‌వాత గోపీచంద్ ప‌ట్టాలెక్కించే సినిమా యూవీ క్రియేష‌న్స్‌లోనే అవుతుంది. త్వ‌ర‌లోనే ఈచిత్రానికి సంబంధించిన అప్ డేట్స్‌ని అధికారికంగా వెల్ల‌డిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close