లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. ఈమేరకు జన జాతర పేరుతో కాంగ్రెస్ తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేతలతో సహా ముఖ్య నేతలంతా పాల్గొననున్నారు. పాంచ్ న్యాయ్- పచ్చీస్ గ్యారంటీల పేరుతో హామీలను ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే వేదికగా ఆరు గ్యారంటీలను ప్రకటించారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తోంది కాంగ్రెస్.
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం హైలెట్స్ 08 : 08PM
తుక్కుగూడలో కదం తొక్కితే.. బీఆర్ఎస్ ను తుక్కుతుక్కుగా అణగదొక్కాం
ఢిల్లీలో మువ్వన్నెల జెండాను ఎగరేస్తాం
కార్యకర్తల కష్టంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది
ప్రతి కార్యకర్త సైనికులా నిలబడి కొట్లడాలి
ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాం
గుజరాత్ మోడల్ పై తెలంగాణ ఆధిపత్యం చూయిస్తోంది.
తెలంగాణలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారో చెప్పి బీజేపీ ఓట్లు అడగాలి
న్యాయం కోసం రైతులు రోడ్దేక్కితే అణగదొక్కారు
ఢిల్లీ సరిహద్దులో రైతులను చంపినందుకు మోడీకి ఓటేయాలా..?
మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోంది.
దక్షిణ, ఉత్తర భారతదేశం మధ్య చిచ్చు పెట్టే కుట్ర
తెలంగాణ మునిగినప్పుడు సిగ్గు లేని కిషన్ రెడ్డి ఒక్కపైసా కేంద్రం నుంచి తీసుకురాలే
బీజేపీ నేతలు ఏమోహంతో తెలంగాణలో ఓట్లు అడుగుతారు..?
నమో అంటే నమ్మితే మోసం
ఈవీఎం, ఈడీ , సీబీఐ, ఐటీ మోడీ పరివారమైతే.. ప్రజలు మా పరివార్ , గాంధీ కుటుంబం మా పరివార్
విభజన హామీలు ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఏవీ ఇవ్వలే
బీఆర్ఎస్ ను బొందపెట్టినట్లే.. బీజేపీని కూడా ఓడించాలి.
పదేళ్ళు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది.
సూర్యాపేటలో కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడారు
నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఉరుకోవడానికి నేను జానారెడ్డి లెక్క కాదు బిడ్డా … రేవంత్ రెడ్డిని
లత్కోరు లఫంగ మాటలకు కేసీఆర్ ను చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తాం
చర్లపల్లి జైలులో కేసీఆర్ కు డబుల్ బెడ్ రూమ్ కట్టించే బాధ్యత నాది
మా సవాల్ కు సిద్దమా కేసీఆర్..?
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లో మీరు ఓట్లు అడగండి.. ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఊర్లో మేము ఓట్లు అడుగుతాం
వంద రోజుల మా పాలన చూసి ఓటేయండి.. ఆరు గ్యారంటీలను అమలు చేసి మీ ముందుకు వచ్చాం
గంట గంటకు డ్రస్సులు మార్చే మార్చి, అబద్దపు ప్రచారాలు చేసే మోడీ మనకు కావాలా..?
తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలను కాంగ్రెస్ తరఫున గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పీచ్ హైలెట్స్ 08 : 02 PM
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే వేదికగా ఆరు గ్యారంటీలను ప్రకటించాం
కాంగ్రెస్ పై విశ్వాసంతో తెలంగాణలో అధికారం అప్పగించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇచ్చాం
5వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. జీరో కరెంట్ బిల్లులు ఇస్తున్నాం
మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగిస్తున్నాం
ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగం హైలెట్స్ 08 : 00 PM
కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాలు సరిగా పడలేదు
కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశాడు
పంట నష్టం తగ్గించే విధంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది.
ఎన్నికల కోసమే ఫాం హౌజ్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు
తెలంగాణకు నరేంద్ర మోడీ ఏం చేయలేదు.. బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదు.
రాహుల్ గాంధీ ప్రసంగం హైలెట్స్ 07 : 19 PM
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇక్కడే హామీలను ప్రకటించాం
పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే మేనిఫెస్టోను రిలీజ్ చేస్తున్నాం
తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశాం
రాష్ట్రంలో హామీలను నెరవేర్చినట్లుగానే జాతీయ స్థాయిలో హామీలను నెరవేరుస్తాం
రాష్ట్రంలో 30 వేల ఉద్యోగాలిచ్చాం.. మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం
ఇది మా మేనిఫెస్టో కాదు.. మా గ్యారంటీలు
మా మేనిఫెస్టో భారతీయుల ఆత్మ
ఏం చేయగలమో.. అదే మేనిఫెస్టోలో చేర్చాం
నిరుద్యోగులందరికీ లక్ష జీతంతో ఉద్యోగ శిక్షణ
యువతకు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం
మహిళలకు మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇచ్చాం
మహిళలకు న్యాయం పేరుతో గ్యారంటీ ప్రకటించాం
ప్రతి మహిళా బ్యాంక్ అకౌంట్ లో ఏటా లక్ష రూపాయలు వేస్తాం
మహిళలు ఆర్థికంగా బలపడితే దేశం ముఖ చిత్రమే మారిపోతుంది
ప్రతి కుటుంబం ఏటా ఆదాయం లక్ష కంటే తక్కువ ఉండబోదు
రైతులకు న్యాయం పేరుతో మూడో హామీ ప్రకటించాం
దేశంలో రోజూ 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
దేశంలోని ధనవంతులకు 16 లక్షల కోట్లు ఋణం మాఫీ చేశారు
పేద రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు
పంటలకు మద్దతు ధర కల్పిస్తాం
స్వామినాథన్ ఫార్ములా ఆధారంగా మద్దతు ధర కల్పిస్తాం
దేశంలో 50శాతం మంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు
15 శాతం మంది దళితులు, 15 శాతం మైనార్టీలు ఉన్నారు
దేశంలో 90 శాతం మంది వెనకబడిన ప్రజలే ఉన్నారు
దేశంలో అతిపెద్ద కంపెనీలలో వెనకబడిన తరగతి ప్రజలు లేరు
పెద్ద, పెద్ద వ్యాపారులైనా దళిత, గిరిజనులు ఉన్నారా..?
భారత ప్రభుత్వంలో కేవలం ముగ్గురే ఐఏఎస్ అధికారులు ఉన్నారు
కార్మికులకు కనీస వేతనం అందేలా చూస్తాం
బీసీలకు దేశంలో సరైన ప్రాధాన్యత లేదు
జనాభాలో బీసీలు 50 %, అధికారంలో మాత్రం 5 %
అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేస్తాం
గత ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
రాష్ట్రంలో వేల మంది నేతల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారు
ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ లబ్ది పొందాలని చూశారు
ఫోన్ ట్యాపింగ్ తో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు
ప్రభుత్వం మారగానే డేటాను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు
దేశంలో మోడీ సైతం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్.. ఇప్పుడు వసూళ్ల సంస్థగా మారింది.
ప్రపంచంలోనే అతిపెద్ద స్కాం ఎలక్టోరల్ బాండ్లు
సీబీఐ వ్యాపారస్తులను భయపెట్టిస్తుంది.
బీజేపీ పెద్ద వాషింగ్ మెషిన్ ను నడుపుతోంది
బీజేపీలో చేరగానే అవినీతిపరులు అంతా నీతిమంతులు అవుతున్నారు.
ఈసీ సహా అన్ని సంస్థల్లోనూ బీజేపీ లీడర్లు ఉన్నారు.
రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తోంది బీజేపీ
తెలంగాణలో బీజేపీ బీ టీంను ఓడించాం.. బీజేపీని కూడా ఓడిస్తాం
ప్రజాస్వామ్యం.. రాజ్యాంగం రక్షించాలనే పోరాటం మాది
కాంగ్రెస్ ఖాతాలను బీజేపీ ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తోంది.
మోడీ దగ్గర ఈడీ, సీబీఐ ఉంటే.. మా దగ్గర ప్రజల ప్రేమ ఉంది.
మా మేనిఫెస్టో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది.
నా జీవితం మొత్తం ప్రజలకే అంకితం
తెలంగాణ ప్రజలతో నాకు రాజకీయ అతీత బంధం ఉంది
సోనియా మీకు అండగా ఉన్నారు.. ఢిల్లీలో నేను సైనికుడిలా ఉంటా
పాంచ్ న్యాయ్ పత్రాలను రిలీజ్ చేసిన రాహుల్ గాంధీ
లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ నేతలతో కలిసి రిలీజ్ చేస్తున్న రాహుల్ గాంధీ
మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగం హైలెట్స్ – 07 : 10PM
జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు రాహుల్ గాంధీ
దేశాభివృద్ధికి తీసుకోబోయే నిర్ణయాలను రాహుల్ గాంధీ ప్రకటిస్తారు
10వేల కి. మీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగింది.
సభా ప్రాంగణానికి చేరుకున్న రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క
మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగం హైలెట్స్ 07 : 00 PM
రాహుల్ గాంధీని ప్రధానిని చేసే బాధ్యత మనందరిపై ఉంది.
దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది
ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా సోనియా గాంధీ తిరస్కరించారు
2009లో రాహుల్ గాంధీకి పీఎం అయ్యే అవకాశం వస్తే తిరస్కరించారు.
మాట్లాడటానికి కేటీఆర్ కు బుద్ది ఉండాలి
కేసీఆర్ భాషను చూసి జనం చీదరించుకుంటున్నారు.
త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే దోచుకున్నారు
కవిత జైలు పాలు కావడం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం
ఎవరినైనా కేసీఆర్ హయాంలో రైతులను ఆదుకున్నారా..?
రేవంత్ రెడ్డి 9సార్లు కాదు.. 32 సార్లు పోతాడు ఢిల్లీకి..? మీకెందుకు..?
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగం హైలెట్స్ – 6 : 55PM
తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం
కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయలి
ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు అందించబోతున్నాం
శాసన సభకు రాని దద్దమ్మ కేసీఆర్
అసెంబ్లీకి రాని వ్యక్తి జిల్లాల బాట పట్టారు
కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకో
కేసీఆర్ భాషను చూసి ప్రజలే తిరగబడతారు
తోడు దొంగలా మాదిరి బీజేపీ – బీఆర్ఎస్ రైతు రాజకీయం
రాముడి పేరుతో మోడీ ఓట్ల రాజకీయం
మంత్రి సీతక్క ప్రసంగం హైలెట్స్
బీజేపీ విద్వేష రాజకీయాలు చేస్తోంది.
గిరిజన హక్కులను బీజేపీ కాలరాస్తోంది.
కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారు.
గాంధీ కుటుంబంది త్యాగాల కుటుంబం
పదేళ్ళలో మోడీ ఏం అభివృద్ధి చేశారు..?
రాహుల్ గాంధీ ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్నారు
పదవుల కోసం రాహుల్ గాంధీ పాకులాడటం లేదు
రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాల్సిన అవసరం ఉంది.
ప్రజల సమస్యలపై పోరాడుతుంటే ఈడీ కేసులు పెడుతున్నారు.
వికసిత్ భారత్ ఎక్కడుంది మోడీ గారు.?
విద్వేషపు కుట్రలతో దేశాన్ని బందీ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
మంత్రి కొండా సురేఖ ప్రసంగం హైలెట్స్
అన్ని గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం
లోక్ సభ ఎన్నికల తర్వాత మిగిలిన గ్యారంటీలను అమలు చేస్తాం
ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో కేసీఆర్ , కేటీఆర్ ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారు.
నాకు నోటిసులు పంపారు కేటీఆర్.. మీ అయ్యా ఏం మాట్లాడాడో తెలుసా..?
కుక్కల కొడుకలని ఎవరి తిడుతున్నారు కేసీఆర్..?
కేసీఆర్ ను బహిరంగంగా ఉరితీసినా తప్పులేదు..
కేసీఆర్ పై ఎక్కడిక్కడ కేసులు పెట్టాలి.
బీఆర్ఎస్ నేతలారా నోరు అదుపులో పెట్టుకోండి.
15 ఎంపీ స్థానాలను గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇద్దాం
భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ ప్రసంగం హైలెట్స్ – 6 : 40 PM
కేసీఆర్ ను ఎలా తరిమికోట్టారో.. మోడీని అలాగే తరిమికొట్టాలి
అబ్ కీ బార్ చార్ సౌ కాదు..ఏక్ సౌ కూడా లేకుండా చేయాలి
తెలంగాణలో 15పార్లమెంట్ స్థానాలు గెలవడం ఖాయం
అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో కార్యకర్తలు పని చేయాలి
చేవేళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రసంగం హైలెట్స్ – 06 : 33 PM
పేదల సంక్షేమం వద్దు.. కార్పోరేట్ సంక్షేమం కావాలంటుంది బీజేపీ
పేదల సంక్షేమం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం
టెలీ కమ్యూనికేషన్ రాజీవ్ గాంధీ తీసుకురావడంతోనే సాంకేతిక అభివృద్ధి
చేవెళ్ల నుంచి మరోసారి అవకాశం ఇవ్వండి.. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తాను
అన్ని రంగాలకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తోంది. లౌకిక వాదమే కాంగ్రెస్ సిద్ధాంతం
బీజేపీ అభ్యర్థి ఐదేళ్ళకోసారి వస్తాడు.. నేను ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటా
మల్కాజ్ గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ప్రసంగం హైలెట్స్ – 06 : 29 PM
రంగారెడ్డి జిల్లాలో మ్యానిఫెస్టో రిలీజ్ చేయడం గర్వకారణం
కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్లే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం
పార్లమెంట్ ఎన్నికల్లోనూ కార్యకర్తలు కష్టపడి పని చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలకే అధిక అవకాశాలు
నేను నాన్ లోకల్ అని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు
ఈ నియోజకవర్గంపై నాకు అవగాహనా ఉంది.. అభివృద్ధి చేశాను
ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తాను
కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే పదేళ్ళు వెనక్కి పోతాం
నాపై నమ్మకం ఉంచండి.. ప్రజల కోసం తప్పకుండా పని చేస్తాను
అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుతున్నా.. నాకు ఆ నమ్మకం కూడా ఉంది.
సంపత్ కుమార్ ప్రసంగం హైలెట్స్( ఏఐసీసీ కార్యదర్శి)- 06 : 21 PM
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను గ్రామ , గ్రామాన తీసుకెళ్ళాలి.
బీజేపీ , బీఆర్ఎస్ లకు తగిన బుద్ది చెప్పాలి
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అవినీతి, అక్రమాలతో అన్ని వర్గాలను మోసం చేసింది.
బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా తెలంగాణ [ప్రజలంతా కృషి చేయాలి
కేఎల్ఆర్ ప్రసంగం హైలెట్స్- 6 : 17 PM
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే వేదికగా నిర్వహించిన సభ సంచలనమైంది
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ ను పర్మినెంట్ గా ఫామ్ హౌజ్ కి పరిమితం చేశారు
ఆరు గ్యారంటీలను ప్రకటించాం.. అమలు చేస్తున్నాం
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలంటే తెలంగాణలోని ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలి
చల్లా నరసింహ రెడ్డి ప్రసంగం హైలెట్స్, 6: 15 PM
దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది
రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా మార్పు వచ్చింది
ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పని
రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు
మల్ రెడ్డి రంగారెడ్డి , ఎమ్మెల్యే ప్రసంగం హైలెట్స్- 06 : 12PM
అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం
పార్లమెంట్ ఎన్నికలకు ఇదే వేదికగా శంఖారావం పూరిస్తున్నాం
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక సీట్లు గెలుపొందాలి
రంగారెడి జిల్లా జడ్పీ చైర్మన్ అనితా రెడ్డి ప్రసంగం హైలెట్స్ 06 : 09 PM
మహిళల సంక్షేమానికి పాటు పడింది కాంగ్రెస్
మహాలక్ష్మి పథకంతో మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసింది
రాజకీయాల్లో మార్పు రావాలంటే కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి
అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడటం లేదు.. కేవలం మతం గురించే మాట్లాడుతోంది