భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చి సర్వం కోల్పోయామనుకుంటున్న బీఆర్ఎస్ పెద్దలు పేరును టీఆర్ఎస్ గా మార్చాలనుకుంటున్నారు. మెల్లగా ఒక్కొక్కరితో ఈ మాట చెప్పిస్తున్నారు. ఇలా మార్చడం ద్వారా తమ ఫేట్ మారిపోతుందన్న ఓ నమ్మకాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఓడిపోయిన మరుక్షణం నుంచే బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
కేసీఆర్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో బలపడి పేరు నుంచి తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయినట్లుగా క్యాడర్ భావిస్తోంది. టిఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన పార్టీ. దీనిని బిఆర్ ఎస్ గా మార్చగానే పార్టీ సెంటిెమెంటుకు దూరమయిందని అంటున్నారు.
అయితే ఇటూ అటూ పేర్లు మార్చుకుంటూపోతే ప్రజల్లో అసలు కామెడీ అయిపోతుంది. పేరు మార్పు అనివార్యమన్న ఓ నెరెటివ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందుకే వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ న్యాయపరంగా సాధ్యమా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఓ సారి పార్టీ మార్పు చేశారు. ఆ పార్టీ పేరు మళ్లీ ఇస్తారా లేదా అన్నదానిపై ఎన్నికలసంఘం వద్ద కూడా స్పష్టమైన రూల్స్ లేవు. పేరు తప్ప బీఆర్ఎస్ లో మారిందేమీ లేదు. గుర్తులు కూడా అవే. అందుకే ఒక వేళ తీర్మానం చేసినా ఈసీ పట్టించుకోదన్న వాదన ఉంది. కేంద్ర పెద్దల సపోర్ట్ ఉంటే పనైపోవచ్చు. ఆ సమయం వరకూ కేసీఆర్ ఆగి… పరిస్థితుల అన్నీ అనుకూలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.