ఏపీలో హాట్ హాట్ సీట్లలో మచిలీపట్నం ఒకటి. . వైసీపీ మార్క్ రాజకీయ విమర్శలతో కొడాలి నానితో పాటు పేర్ని నాని కూడా హైలెట్ అయ్యారు. ఇప్పుడు ఆయన వైదొలిగి ఆయన కుమారుడికి సీటు ఇప్పించుకున్నారు. టీడీపీ తరపున మాజీ మంత్రి కొల్లు రవీంద్రనే పోటీ చేస్తున్నారు. పోటీ హోరాహోరీగా ఉన్నా జనసేనతో పొత్తు మాత్రం టీడీపీకి అడ్వాంటేజ్ గా మారింది.
ప్రస్తుతం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పేర్ని నాని ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పోటీ చేసి విజయం సాధించారు. దాదాపుగా మూడేళ్లు మంత్రిగా పనిచేసిన పేర్ని నాని.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా చెబుతుంటారు.. కానీ ఆయన పదవి ఆ పేరుతో నిలబడలేదు. చంద్రబాబు నివాసంపై దాడితో పాటు నానిని మించి చంద్రబాబు, రఘురామలపై బూతులు తిట్టిన జోగి రమేష్ ప్రతిభను మెచ్చి మంత్రి పదవి ఆయనకే ఇచ్చారు.
పేర్ని నానికి కుటుంబపరమైన సమస్యల కారణంగా కుమారుడ్ని రాజకీయ వారసుడిగా ప్రకటించాలన్న ఒత్తిడి ఉంది. ఆయనను ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించాల్సిన అవసరం పడింది. మంత్రిగా ఉన్నప్పటి నుండి నియోజకవర్గంలో కుమారుడు పేర్ని కిట్టునే అధికారం చెలాయించారు. వచ్చే ఎన్నికల్లో వారసులకు టిక్కెట్లు ఇచ్చేది లేదని అంతకుముందే సీఎం జగన్ చెప్పినా.. నాని మాత్రం తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పేర్ని కిట్టును గెలిపించుకునేందుకు పేర్ని నాని ఇప్పుడు పరుగులు పెడుతున్నారు.
టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు. పేర్ని నానిపై.. పేర్ని కిట్టు వ్యవహారాలపై ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉందనే భావనతో ఉన్న టీడీపీ.. ఈ సారి బందరు సీటు కచ్చితంగా తమదేననే ధీమాతో ఉంది. బందరు సెగ్మెంటులో టీడీపీలో పెద్దగా గ్రూపులు లేకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. పార్టీ మొత్తం కొల్లు రవీంద్ర వెంట ుంది. గత ఎన్నికల్లో జనసేన కాపు సామాజిక వర్గ ఓట్లను చీల్చటం వల్లే రవీంద్ర ఓడిపోయారనే భావనలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ సారి పొత్తు ఉండటంతో ఇక తిరుగు ఉండదని అనుకుంటున్నారు.
కొల్లు రవీంద్ర సౌమ్యుడు. ఐదేళ్లుగా మంత్రిగ ఉన్న ఆయన ఏ ఒక్క ఇతర పార్టీ కార్యకర్త జోలికి వెళ్లలేదు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే అసలు స్పేసే లేని ఓ హత్య కేసులో ఆయనను ఇరికించింది. హత్యకేసులో నిందితుల్ని పట్టుకున్న తర్వాత పోలీసులే.. నిందితుల ఫోన్ నుంచి కొల్లు రవీంద్రకు ఫోన్ చేయించి.. ఆ ఫోన్ కాల్ సాక్ష్యంగా రవీంద్రపై కేసు పెట్టారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేశారు. రవీంద్రపై ఇలాంటి దాడి చేయడంతో ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరిగింది. తన మంచితనం చేతకాని తనం కాకూడదన్న ఉద్దేశంతో కొల్లు రవీంద్ర ఇప్పుడు మాస్ లీడర్ అవతారం ఎత్తారు. ఎలాంటి సమస్య ఎదురైనా చిటికెలో వాలిపోతూ ప్రజల్ని ఆకట్టుకున్నారు. టిడిపి అధినేత చంద్రబాబుకు సైతం అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నే రవీంద్ర.. పార్టీలోనూ బీసీ ఫెడరేషన్ బాధ్యతలను చూస్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు ఆ వర్గం ఓట్లు అదనపు బలం
మాజీ మంత్రి పేర్ని నాని సమయం సందర్భం లేకుండా జనసేనాని పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం.. ఆ సామాజిక వర్గంలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇది ఎవరికి ప్లస్సో.. ఎవరికి మైనస్‌గా మారుతోందోననే విశ్లేషణలకు ఎక్కువగా జరుగుతున్నాయి. నాని కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడం.. టీడీపీతో జనసేన పొత్తును తప్పుబడడుతుండటం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తోంది. నియోజకవర్గంలో రోజురోజుకి క్షీణిస్తున్న శాంతి భద్రత సమస్యలు ఓటింగ్‌లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎలా చూసినా పేర్ని నానికి కుమారుడ్ని గెలిపించుకోవడం.. విషమ పరీక్షగా మారింది.