కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సైలెంట్ గా మరో విచారణ ప్రారంభమయింది. విద్యుత్కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ ఒప్పందాల్లో అవకతవకల్ని బయట పెట్టేందుకు ప్రభుత్వం నియమిచిన కమిటీ పన ప్రారంభించింది. ప్రభుత్వం కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్‌గఢ్ డిస్కంల నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
వీటిపై న్యాయ విచారణ జరిపేందుకు పాట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ’గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. సమాచారం, సాక్ష్యాలు, ఆధారాలను ఎవరైనా కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప ్రకటించారు. సంబంధం ఉందని కమిషన్ భావిస్తే మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులను కూడా విచారణకు పిలుస్తామని .. మొదట రిక్వెస్ట్ లెటర్స్ రాస్తామనీ, వాటికి స్పందించకుంటే సమన్లు పంపుతామని జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. మూడు ఒప్పందాలకు సంబంధించిన ఫైళ్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే అనేక రకాల విచారణలు జరుగుతున్నాయి. సచివాలయం అక్రమాలు.. వంటిని పక్కన పెట్టి పూర్తిగా భారీ స్కాములపైనే దృష్టి పెట్టారు. కాళేశ్వరం.. విద్యుత్ ఒప్పందాలు అలాంటి కోవలోకే వస్తాయి. డబ్బులతో సంబంధం లేకపోయినా.., ఫోన్ ట్యాపింగ్ అత్యంత కీలకంగా మారింది.ఆ కేసు కూడా కేసీఆర్, కేటీఆర్ మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.