సోషల్ మీడియా పోస్టుల దగ్గర్నుంచి చంద్రబాబు అక్రమ అరెస్టు వరకూ మొత్తం డీల్ చేసిన సీఐడీ, సిట్ ఆఫీసుల్లో పత్రాలన్నీ సర్దుకునే పనిలో అధికారులు ఉన్నట్లుగా కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, ట్యాపింగ్లు, అనధికార సమాచార సేకరణ .. ఇలా లెక్క లేనన్ని అక్రమాలను.. అధికారులు ేశారు. ఇప్పుడు టైం దగ్గర పడే సరికి అన్నింటినీ డిలీట్ చేయాలనుకుంటున్నారు.
టెక్నికల్ గా అయితే ఎవరికీ తెలియకుండా తెలంగాణలో ప్రణీత్ రావు చేసినట్లుగా మొత్తం డిలీట్ చేసి హార్డ్ డిస్కుల్ని నిలువుగా కోసేసి ఏదో ఓ నదిలో పడజేయవచ్చు. కానీ పత్రాలను మాత్రం తగులబెట్టాల్సిందే. అందుకే సిట్ ఆఫీసులో ఉన్న పత్రాలన్నింటినీ ముఖ్యంగా టీడీపీ నేతలపై ఉన్న కేసులకు సంబంధించి అక్రమంగా సంపాదించిన పత్రాలన్నింటికీ నిప్పు పెట్టేశారు.
సీఐడీ , సిట్ ఆఫీసులోని వ్యక్తులే ఈ విషయాన్ని గమనించి వీడియో తీసి మీడియాకు పంపారు. మీడియాలో ఈ అంశం సంచలనంగా మారింది. చిత్తు కాగితాల్ని తగలుబెట్టామని వారు కవర్ చేసుకోవచ్చు కానీ.. అవి హెరిటేజ్ కు సంబంధించిన పత్రాలని తగలబడకుండా దొరికిన కొన్ని అవశేషాల ద్వారా తేలింది. అయితే టీడీపీ నేతలు మాత్రం కాలిస్తే కనబడకుండా పోయే తప్పులు కాదని చేసింది.. అంతకు మించి చేశారని.. అంటున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత తప్పక అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.