జనసేనకు రాజీనామా చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోతిన మహేష్ మాట్లాడారు. సుమారు గంటపాటు ఆయన పవన్ ను టార్గెట్ చేస్తూ ముందే రెడీ చేసుకొని తెచ్చుకున్న స్క్రిప్ట్ ను అక్షరం పొల్లు పోకుండా చదివేశారు. ఆయన వ్యాఖ్యలను చూస్తే ఆయన ఎవరి డైరక్షన్ లో మాట్లాడారో ఈజీగా అర్థం అవుతోంది. వైసీపీ రెడీ చేసిన స్క్రిప్ట్ ను చదివినట్లుగా పేపర్లను తిరగేశారు.పవన్ కళ్యాణ్ 21 సీట్లు తీసుకోవడం మహా పాపమని… కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడన్నారు. 21సీట్లకు కాపుల ఆత్మగౌరవానికి ఏం సంబంధమో ఎవరికీ అర్థం కాలేదు.
పోతిన మహేష్ కు పెద్దగా కవరేజ్ ఇవ్వని సాక్షి మీడియా తాజా ప్రెస్ మీట్ కుమాత్రం ఊహించని ఇవ్వని విధంగా కవరేజ్ ఇచ్చింది. పవన్ పై విమర్శలను తెగ ఎంజాయ్ చేయడం వారి అలవాటు. పవన్ పోటీ చేస్తోన్న పిఠాపురంలో భార్యతో కలిసి గృహ ప్రవేశం చేయాలనేది తన కోరిక అంటూ కామెంట్స్ చేశారు. ఈ విధమైన కామెంట్స్ చేయకపోతే తనకు మీడియాలో స్పేస్ దక్కదని అనుకున్నారో ఏమో కాని ఈ ఎపిసోడ్ లోకి పవన్ భార్యను తీసుకొచ్చారు. అయితే.. కొన్ని రోజులుగా జనసేనలోనే ఉంటూ తనకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చిన మహేష్.. అనూహ్యంగా ఫ్లేట్ ఫిరాయించడం వెనక వైసీపీ హస్తం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని టార్గెట్ పెట్టుకుంది వైసీపీ. వంగా గీతకు టికెట్ ఇచ్చారు..కానీ అక్కడ జనసేనానికి ఏకపక్ష విజయం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వంగా గీతకు మద్దతుగా ముద్రగడ ప్రచారం కూడా ప్రారంభించలేదు.ఆయన ప్రచారానికి వచ్చినా పెద్దగా ఉపయోగపడడం ఉండదని తేలడంతోనే ప్రచారానికి దూరంగా ఉన్నారని స్థానికంగా వినిపిస్తోన్న మాట. పవన్ కు చెక్ పెట్టాలంటే జనసేన నేతనే లాక్కోవాలని చూశారని.. ఇప్పుడు పిఠాపురంలో జనసేనానికి వ్యతిరేకంగా మహేష్ ను ప్రచారంలో ఇన్వాల్వ్ చేస్తారని టాక్ నడుస్తోంది. అందుకే పవన్ టార్గెట్ గా పోతిన విమర్శలు ఉన్నాయని అంటున్నారు.