జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా తమ ఊరికి వచ్చినా.. అధికారంలోకి వచ్చినా ప్రజలకు నరకమేనని నిరూపిస్తున్నారు వైసీపీ నేతలు. బస్సు యాత్ర పేరుతో ఆయన రాజకీయ ప్రచారం చేసుకోవాలనుకున్నారు. కానీ జనం తిరుగుబాటు భయంతో స్క్రిప్టెడ్ టూర్ గా మార్చేశారు. ప్రజల్ని దగ్గరకు రానీయడంలేదు. సరే రానివ్వకపోతే పోయారనుకుంటే… వాళ్లను టార్చర్ పెట్టేస్తున్నారు. ఆయన ఎక్కడ పర్యటిస్తున్నా అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు. ఈ చెట్లు కొట్టే ఫాంటసీ ఏమిటో జనాలకు అర్థం కావడం లేదు. హైవేల పక్కన చెట్లు ఉండటం కామన్. అవి నీడను ఇస్తాయి. కానీ వాటిని కొట్టించేస్తున్నారు. చాలా చోట్ల ప్రజలు తిరగబడుతున్నారు.
విచిత్రం ఏమిటంటే.. కరెంటో పోల్ల్ కూడా తీసేస్తున్నారు. వైర్లు కత్తిరించేస్తున్నారు. ఆయన ఏదైనా ఊళ్లకి బస్ యాత్ర ద్వారా ఎంటర్ అవుతున్నారంటే.. పది గంటల పాటు కరెంట్ ఉండదు. ఆయనొస్తే చీకటి అని సింబాలిక్ గా నిరూపిస్తున్నారు. ఇవన్నీ సెక్యూరిటీ ఏర్పాట్లని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంత సాగదీసుకోవద్దని.. ప్రజలు చీవాట్లు పెడుతున్నారు. బస్సు యాత్ర జరిగిన చోటల్లా ప్రజలకు ఇలాంటి ఇబ్బందులే కలిగాయి. వారంతా శాపనార్థాలు పెడుతున్నా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు.
బస్సు యాత్రను ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ.. స్క్రిప్టెడ్గా చేసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం అనేది వైసీపీ నేతలకూ అర్థం కావడంలేదు. అదనంగా ఒక్క ఓటు తెచ్చుకోకపోగా .. ఈ యాత్రల వల్ల ఇబ్బందిపడే పార్టీ సానుభూతిపరులు కూడా వ్యతిరేకమయ్యే పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. మొత్తం పెయిడ్ ఆర్టిస్టులతో కథ నడిపించుకునేందుకు అసలు ప్రజలకు భాగస్వామ్యం ఇవ్వని బస్సుయాత్రలెందుకని సొంత పార్టీ నేతలే చిరాకుపడుతున్నారు.