లోక్ సభ ఎన్నికల్లో అందరి దృష్టి వారణాసి నియోజకవర్గంపై నెలకొంది. ప్రధాని మోడీ పోటీ చేస్తోన్న ఈ నియోజకవర్గం నుంచి ఓ ట్రాన్స్ జెండర్ పోటీలో ఉండటంతో వారణాసికి ప్రాధాన్యత ఏర్పడింది. అఖిల భారత హిందూ మహాసభ అభ్యర్థి కిన్నార్ మహా మండలేశ్వర్ హిమాంగి సఖీ బరిలో నిలుస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అద్యక్షుడు స్వామి చక్రపాణి వెల్లడించారు.
హేమాంగి సఖి కూడా మోడీ సొంత రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. బరోడాలో జన్మించిన మహా మండలేశ్వర్ హిమాంగి సఖీ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.ఆమె తండ్రి డిస్ట్రిబ్యుటర్ కావడంతో వారు బరోడా నుంచి ముంబైకి మకాం మార్చారని తెలుస్తోంది.పలు టీవీ షోలో కూడా కనిపించారు. ఆమె ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తోన్న తొలి ట్రాన్స్ జెండర్ కావడం విశేషం. 2019 ఫిబ్రవరిలో ఆచార్య మహా మండలేశ్వర్ గా పట్టాభిషేకం జరిగింది.అఖిల భారతీయ సాధు సమాజ్ భాగావత్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది.
శ్రీకృష్ణుని భక్తురాలైన ఈమె భగవత్ కథలు, దేవి భగవత్ కథలు కూడా రాశారు. కాగా, మోడీకి హేమాంగి సఖి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందన్న చర్చ జరగుతోంది. అఖిల భారతీయ హిందూ మహాసభ మద్దతుతో మోడీకి పోటీనిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. కానీ, మోడీని ఎదుర్కొనేందుకు ఆయన బలం సరిపోదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.